P Krishna
Tamil Nadu: భారతీయులకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ రకాలు మరే దేశంలో దొరకవు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. విదేశీయులు మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ తినేందుకు తెగ ఇష్టపడతారు.
Tamil Nadu: భారతీయులకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ రకాలు మరే దేశంలో దొరకవు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. విదేశీయులు మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ తినేందుకు తెగ ఇష్టపడతారు.
P Krishna
భారత దేశంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రక రకాల స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. దేశంలో కోట్లాది ప్రజల జీవనశైలిలో ఆహారం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఆహార పద్దతులు మారతూ కనిపిస్తాయి. అందుకే మన దేశంలో విభిన్నమైన వంటకాల రుచులను చూడగలుగుతున్నాం. దేశంలో స్ట్రీట్ ఫుడ్స్ ఎంతో ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం మన దేశంలోని స్ట్రీట్ ఫుడ్ తినేందుకు తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువగా పానీ పూరీ, వడా పావ్, చికెన్ షవర్మా ఫేమస్. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ షవర్మా ఇష్టపడుతుంటారు. తాజాగా చికెన్ షవర్మా తిన్న ఓ కుటుంబం ఆస్పత్రిపాలైంది. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో చికెన్ షవర్మా తిన్న కుటుంబ సభ్యులు వాంతులు, కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా ఆహార భద్రతా విభాగం సదరు ఫుడ్‌స్టాల్‌కు సీల్ వేసింది. ఆ స్టాల్ లో ఉన్న మూడు కిలోల మసాలా చికెన్ కర్రీ, నాలుగు కిలోల సాదా చికెన్ కర్రీని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా పుదుకోట్టైలోని పుదుక్కుళం సమీపంలో ఉన్న ఈ స్టాల్ లో చికెన్ షవర్మా ఫేమస్. ఎంతోమంది భోజన ప్రియులు ఇక్కడికి వచ్చి దీన్ని ఇష్టంగా తింటారు. దక్షిణామూర్తి మార్కెట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హకీం తన భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం రాత్రి స్టాల్‌కు వచ్చి చికెన్ షవర్మా తిన్నారు.
మంగళ వారం తెల్లవారుజామున ఐదుగురు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలుసుకున్న పక్కింటి వారు వెంటనే చికిత్స కోసం పుదుకోట్టై ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ నగర్ పోలీసులు అబ్దుల్ హకీం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ విషయంపై పుదుకోట్టై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రవీణ్ కుమార్‌ను సంప్రదించారు పోలీసులు. ఇరువురు షాపు యజమాని యూసుఫ్ ని విచారించారు. అయితే బాధితులు షవర్మ కానీ, చికెన్ రోల్స్ కానీ తినలేదని అతను చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. జిల్లా ఆహార భద్రత విభాగం అధికారులు దుకాణాన్ని పూర్తిగా తనిళఖీ చేసి పలు వస్తువులు స్వాధీనం చేసుకొని ధ్వంసి చేసి దుకాణానికి సీలు వేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ం మాట్లాడుతూ.. ఈ దుకాణంలో షవర్మా తిని ఐదుగురు కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుదుకొట్టై జిల్లాలో రెండేళ్లుగా షవర్మా విక్రయాలపై నిషేదం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి వారిపై చ్యలు తీసుకుంటాం, పండుగల సందర్భంగా తీపి పదార్ధాలు తయారు చేసే సమయంలో రంగులు, రసాయనాలు ఎక్కవ కలపవొద్దని షాపు యజమానులకు సూచించాం, ఎప్పటికప్పుడు ఫాస్ట్ ఫుడ్ అవుట్ లెట్ లను తనిఖీ చేస్తున్నాం’ అని అన్నారు.