iDreamPost
android-app
ios-app

అవమానించిన మాల్ సిబ్బందిపై రైతు మంచి మనస్సు! ఇది కదా మానవత్వం!

GT Mall Farmer: రెండు రోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ లో రైతుకు అవమానం జరిగిన ఘటన అందరికి తెలిసింది. అయితే తాజాగా ఆయన తనను అవమానించిన సిబ్బంది విషయంలోనే మంచి మనస్సు చాటుకున్నారు. దీంతో ఆ రైతుపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

GT Mall Farmer: రెండు రోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ లో రైతుకు అవమానం జరిగిన ఘటన అందరికి తెలిసింది. అయితే తాజాగా ఆయన తనను అవమానించిన సిబ్బంది విషయంలోనే మంచి మనస్సు చాటుకున్నారు. దీంతో ఆ రైతుపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

అవమానించిన మాల్ సిబ్బందిపై రైతు మంచి మనస్సు! ఇది కదా మానవత్వం!

ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుట వ్యక్తుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎదుట వ్యక్తి  వస్త్రాధారణ, వారి వద్ద ఉంటే ధనం వారికి విలువ ఇస్తున్నారు. ఇలా కేవలం చదువుకోని వారే కాకుండా చదువుకున్న వారు కూడ  ఉన్నారు. అయితే అలా తమని అవమానించిన వారిని సైతం కొందరు క్షమిస్తుంటారు. అలాంటివారిలో ఒకరే ఇటీవల వార్తల్లో నిలిచిన  రైతు. బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ కి పంచెకట్టులో వెళ్లినందకు లోపకి అనుమతించకుండా అవమానపరిచారు. ఆ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆ రైతు చెప్పిన మాటలు అందరు ఫిదా అయ్యారు. ఇది కదా రైతన్న మనస్సంటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్త వివరాల్లోకి వెళ్తే…

రెండు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని జీటి మాల్ లో రైతులు అవమానం జరిగిన సంగతి తెలిసింది. ఉద్యోగ  రీత్యా బెంగళూరులో ఉంటున్న ఓ యువకుడు దగ్గరకు తన తండ్రి వచ్చాడు. దీంతో తన తండ్రికి సీటి చూపించాలనే ఉద్దేశంతో ఆ కుమారుడు జీటీ మాల్ కు తీసుకెళ్లాడు. అయితే ఆ జీటీ మాల్ లో తన తండ్రితో కలిసి సినిమా చూద్దామనుకున్నాడు. కానీ, ఊరి నుంచి వచ్చిన తన తండ్రికి బెంగళూరు జిటీ మాల్ సిబ్బంది అడ్డుకుని అవమానకరంగా ప్రవర్తించారు. ముఖ్యంగా మాల్ ఎంట్రన్స్ లోనే తండ్రీకొడుకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమన్హారం. తాజాగా ఆ మాల్స్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఏకంగా ఆ మాల్ ను తాత్కాలికంగా మూసేయాలంటూ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక తాము చేసింది తప్పే అంటూ..మాల్ యాజమాన్యం రైతుకు క్షమాపణులు చెప్పింది.

ఇదే సమయంలో తాజాగా ఆ రైతును ఆపిన సెక్యూరిటి గార్డును ఉద్యోగంలో నుంచి తొలగిస్తారని వార్తలు వచ్చాయి. మాల్ సెక్యూరిటీ గార్డును కూడా తొలగిస్తారన్న వార్తలపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ‘నన్ను ఆపిన ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని విన్నాను. దయచేసి అలా చేయకండి. అతడికీ ఓ కుటుంబం ఉంటుంది కదా’ అని ఆ రైతు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన మంచి మనసు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ రైతన్న మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువుకున్న మూర్ఖులకంటే.. ఈయన ఎంతో  గ్రేట్ అంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. తనను అవమానించినా కూడా ఎదుటి వారికి నష్టం అన్యాయం జరకూడదని భావించిన ఆ రైతుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరి..  ఈ  రైతును మీరు ప్రశంసించాలంటే..కామెంట్స్ రూపంలో తెలియజేయండి.