P Krishna
Modi Guarantee: ఈ మద్య మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల స్కీమ్ లు తీసుకువస్తున్నాయి. వివిధ పథకాలతో ఆర్థికంగా మహిళళకు చేయూతనిస్తున్నాయి.
Modi Guarantee: ఈ మద్య మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల స్కీమ్ లు తీసుకువస్తున్నాయి. వివిధ పథకాలతో ఆర్థికంగా మహిళళకు చేయూతనిస్తున్నాయి.
P Krishna
మహిళాభ్యున్నతి కోసం రక రకాల స్కీమ్ లు ప్రవేశ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. మోదీ గ్యారంటీ కింద ఎందో మందిని అదుకుంటున్నారు. అయితే దీన్ని కొంతమంది దళారులు క్యాష్ గా మార్చుకుంటున్నారు. మోదీ గ్యారెంటీ కింద డబ్బులు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తూ ఎంతోమంది పేద ప్రజలను దారుణంగా మోసం చేస్తు డబ్బులు గుంజుతున్నారు.. తీరా అది అవాస్తవం అని తేలిన తర్వాత లబోదిబో అంటున్నారు. పోస్టాఫీస్ లో 3వేలు జమ అవుతాయని పుకార్లు రావడంతో కొత్త ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఎగబడ్డారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మహిళల కోసం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తూ వారికి చేయూతనిస్తున్నారు. బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. తాజాగా మోదీ గ్యారెంటీ కింద డబ్బులు వస్తాయని రూమర్లు మొదలయ్యాయి. పోస్టాఫీస్ లో పొదుపు ఖాత ఉన్న మహిళలకు ప్రతి మూడు నెలలకు రూ.3000 జమ అవుతాయని ప్రచారం జరిగింది. దీంతో ఎంతోమంది మమిళలు ఇది గుడ్డిగా నమ్మి పోస్టాఫీస్ లో ఖాతా తెరిచేందుకు క్యూ కట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో జరిగింది. ఒక్కసారిగా వందల సంఖ్యల్లో మహిళలు పోస్టాఫీస్ కి రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అసలు విషయం ఏంటా అని ఆరా తీయగా… ప్రతి మూడు నెలలకు 3 వేలు మహిళల ఖాతాల్లో జమ చేస్తారని, అందుకోసం కొత్త ఖాతాలను తెరిచేందుకు వచ్చామని మహిళలు చెప్పారు.
ఈ విషయం విన్న పోస్టాఫీస్ అధికారుల ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే మహిళలకు అది తప్పుడు ప్రచారం అని.. అలాంటి పథకాలు ప్రస్తుతానికి ఏవీ లేవని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు పోస్టాఫీస్ ముందు ఇది తప్పుడు ప్రచారం అని వాటిని ఎవరూ నమ్మవొద్దని పోస్టర్లు అంటించారు అధికారులు. కొంతమంది మంది మహిళలు మాత్రం పక్కవాళ్లు ఖాతా ఓపెన్ చేశారు.. తాము కూడా చేస్తామంటూ రాత్రి 8 గంటల వరకు పోస్టాఫీస్ కి వచ్చారు. ఈ మేరకు సీనియర్ పోస్ట్ మాస్టర్ మాట్లాడుతూ ‘మోదీ గ్యారెంటీ అనే స్కీమ్ లేదని.. మహిళలకు 3 వేలు జమ చేసే స్కీమ్ అసలు లేదని, తప్పుడు ప్రచారాలు నమ్మి సమయం వృధా చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు. ప్రతి నెల 3 వేలు వస్తాయని ఆశపడ్డ మహిళలు అధికారుల మాటలు విని తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.