Dharani
Dharani
చంద్రయాన్ 3 ప్రయోగం విజయం భారతావనని మొత్తం ఉత్తేజపరిచింది. ఇస్రో సాధించిన విజయం చూసి ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. ఇక చంద్రయాన్ 3.. జాబిల్లి మీద అడుగు పెట్టే అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు మన దేశ ప్రజలు మాత్రమే కాక.. విదేశీయలు సైతం ఆసక్తి చూపారు. ఇక చంద్రయాన్ -3 ల్యాండింగ్.. లైవ్ స్ట్రీమింగ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది. ఇక గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా చంద్రయాన్ 3 కి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. వీటిల్లో జనాలను బాగా ఆకర్షించిన వార్త చంద్రుడిపై ఇండియా శాశ్వత ముద్ర. చంద్రయాన్ 3 విజయం సాధించిన సందర్భంగా.. అందుకు చిహ్నంగా.. జాబిల్లి ఉపరితలం మీద శాశ్వత ముద్ర ఉండేలా చేశారు అనే వార్త. ఫొటో బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఇది ఫేక్ అని తెలిసింది.
విక్రమ్ ల్యాండర్ తీసుకొని పోయిన రోవర్ టైర్లపై ఇస్రో లోగోతో పాటు భారత జాతీయ చిహ్నమైన 4 తలల సింహం బొమ్మలు ఉన్నాయి. రోవర్ జాబిల్లిపై అడుగు పెట్టినప్పుడు ఆ గుర్తులు అలాగే జాబిల్లి మీద ముద్రితమయ్యాయి.. చంద్రుడి మీద గాలి ఉండదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ఉంటాయి అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇది ఫేక్ అని తెలిసింది. ఈ ఫొటో కూడా అవాస్తవం అని వెల్లడయ్యింది. ఈ ఇమేజ్ చివరి భాగంలో దాన్ని క్రియేట్ చేసిన క్రిషన్షు గార్గ్ అనే పేరు ఉంది. దాంతో లాజికల్ ఫ్యాక్ట్స్ వ్యవస్థాపకుడు.. అంతరిక్ష ఔత్సాహికుడు అయిన గార్గ్‌ని దీని గురించి ప్రశ్నించారు. దాంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ఈ సందర్భంగా గార్గ్ మాట్లాడుతూ.. ఈ ఫొటోని నేను చంద్రయాన్ ల్యాండింగ్‌కు పది గంటల ముందు పోస్ట్ చేశాను. దీన్ని ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అడోబ్ ఫొటోషాప్‌ని ఉపయోగించి.. క్రియేట్ చేశాను. అయితే ల్యాండింగ్ తర్వాత ప్రజలు దాన్ని నిజమైన ఫొటో అనుకుని.. చేశారు. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను అని తెలిపాడు.
No, viral image does not show actual imprints left by #Chandrayaan3‘s Pragyan rover on the lunar surface. The image was generated using Photoshop. Fact-check by @SohamShah07.https://t.co/jpen8EgydU
— Logically Facts (@LogicallyFacts) August 24, 2023