Arjun Suravaram
హిందూ వివాహ వ్యవస్థలో ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లిని వివాహం చేసుకోవడం జరుగుతుందా?. అసలు అలాంటి చెత్త ప్రశ్న ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేయకండి. అలాంటి విచిత్ర వివాహం ఓ ప్రాంతంలో నేటికి జరుగుతోంది.
హిందూ వివాహ వ్యవస్థలో ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లిని వివాహం చేసుకోవడం జరుగుతుందా?. అసలు అలాంటి చెత్త ప్రశ్న ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేయకండి. అలాంటి విచిత్ర వివాహం ఓ ప్రాంతంలో నేటికి జరుగుతోంది.
Arjun Suravaram
హిందూ సంప్రదాయాల్లో వివాహ బంధానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అలానే దీని విషయంలో ఎన్నో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. పెళ్లి అనేది సాధారణంగా వేరు వేరు స్త్రీ, పురుషులకు మధ్య జరుపుతారు. ఇక అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు వరుసయ్యే వారికి అస్సలు పెళ్లిళ్లు చేయ్యరు. అయితే అందరిని విస్మయానికి గురి చేస్తూ ఓ గిరిజన తెగ మాత్రం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నాచెల్లెలికి, అక్కాతమ్ముడికి వివాహం చేస్తున్నారు. ఇలాంటి విచిత్రమైన పెళ్లిళ్ళు బహుశా ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. ఇంతకీ ఈ చిత్రమైన ఆచారం ఎక్కడ? అసలు అలా ఒకే తల్లి బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారత దేశంలో అనేక రకాల కులాలు,మతాలు, జాతులు, తెగలు ఉన్నాయి. అంతేకాక ఎన్నో రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మన దేశంలో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అడవుల్లో నివసించే..గిరిజన తెగల్లో కొందరు చాలా విచిత్రమైన సంప్రదాయాలను పాటిస్తుంటారు. వారు పాటించే కొన్నిఆచారాల విషయానికి వస్తే.. హిందూవుల సైతం వ్యతిరేకించేవిలా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో హిందూ మతంలో అనేక సంప్రదాయాలు, కట్టుబాట్లు మనకు కనిపిస్తుంటాయి. ఒకే కులంలో ఒకే గోత్రం ఉన్నవారు కూడా పెళ్లిళ్లు చేసుకోరు. అలానే అన్నా చెల్లెళ్ల వరుస అయినా కూడా వివాహం జరిపించరు. అయితే ఛత్తీస్ గఢ్ లోని ఓ తెగ మాత్రం ఏకంగా ఒకే తల్లి కడుపున పుట్టిన అమ్మాయి, అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు.
ఛత్తీస్ గడ్ లోని బస్తర్ జిల్లాలో ధ్రువ అనే గిరిజన తెగ..బాహ్య ప్రపంచానికి దూరం అడవుల్లో నివస్తున్నారు. అడవుల్లో దొరికే వస్తువులను సేకరిస్తూ..జీవనం సాగిస్తున్నారు. ఈ తెగలో ఒకే తల్లికి పుట్టిన అన్నా చెల్లెళ్లకు, అక్కాతమ్ముడికి వివాహం చేస్తున్నారు. ఇది కొన్ని దశాబ్ధాలుగా వస్తున్నా ఆచారమని వారు అంటున్నారు. తమ జాతిని విస్తరించేందుకు చాలా ఏళ్ల క్రితం..ఆ గిరిజన తెగ పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంట. అయితే కాలం మారుతున్న.. ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నా కూడా వారు తమ ఆచారాన్ని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికీ అదే పెళ్లి విధానాన్ని కొనసాగిస్తున్నారు. మేనరికం చేసుకుంటే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని అందరికి తెలిసిందే. కానీ ఈ తెగలో సోదరిసోదరుడు పెళ్లి చేసుకున్నప్పటికీ ఎలాంటి అంగవైకల్యం లేకుండాని పిల్లలు జన్మిస్తున్నారు.
అలా మేనరికంతో పుట్టిన పిల్లలకు ఎంతో ఆరోగ్యంగా ఉండటం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే వాళ్లు ఎలాంటి వాతావరణ పొల్యూషన్, రసాయనాలతో పండించే పంటలను తీసుకోకపోవడం ప్రధాన కారణమని, అలానే స్వచ్ఛమైన గాలి, ఆహారం తీసుకోవడం వలనే ఆ తెగలో పుట్టే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని అభిప్రాయ పడుతున్నారు. కేవలం తమ జాతి సంఖ్యను పెంచడం కోసం, తమ ఆచారాల కోసం ఒకే కడుపున పుట్టిన వారికి పెళ్లిళ్లు చేయడం ఆధునిక సమాజాన్ని విస్మయానికి గురి చేస్తుంది. మరి.. ఈ వింతైనా ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.