iDreamPost
android-app
ios-app

కోల్‌కతా ట్రైనీ వైద్యులరాలిపై హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ అరెస్ట్!

  • Published Sep 03, 2024 | 8:03 AM Updated Updated Sep 03, 2024 | 8:03 AM

RG Kar Hospital Sandip Ghosh Arrested: కోల్‌కతా ట్రైనీ వైద్యులరాలిపై అత్యాచారాం, హత్య సంఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులకు కఠినంగా శిక్షపడాలని దేశం మొత్తం పెద్ద ఎత్తన నిరసనలు చేపట్టారు.

RG Kar Hospital Sandip Ghosh Arrested: కోల్‌కతా ట్రైనీ వైద్యులరాలిపై అత్యాచారాం, హత్య సంఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులకు కఠినంగా శిక్షపడాలని దేశం మొత్తం పెద్ద ఎత్తన నిరసనలు చేపట్టారు.

కోల్‌కతా ట్రైనీ వైద్యులరాలిపై హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ అరెస్ట్!

ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. చిన్న పిల్లలు, వృద్ద మహిళలు అని చూడకుండా కామంధులు మృగాళ్లు మారి రెచ్చిపోతున్నారు. కోల్‌కొతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు నిందితుడు సంజయ్ రాయ్ కి పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించగా పొంతనలేని సమాధానం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన కోల్‌కొతా ట్రైనీ డాక్టర్ కేసులో గత 16 రోజులుగా సుధీర్ఘ విచారణ తర్వాత సీబీఐ అధికారులు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. సామాన్యులు, డాక్టర్లు, సినీ, రాజకీయ నేతలు సైతం భారీగా ర్యాలీలు తీస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయను విచారించి అరెస్టు చేశారు. ఇప్పటికే సందీప్ ఘోష్ ను రెండు కేసులలో విచారించాక ఏ కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుందో అన్న విషయంపై క్లారిటీ లేదు. కాగా, ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

గత నెల ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ఓ మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైఖరి అనుమానాస్పదంగా ఉండటంతో సీబీఐ ఆయనను దాదాపు 140 గంటలే విచారణ జరిపింది. అలాగే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లో ఆర్థిక అవకతవకల విషయంలో సీబీఐ దర్యాప్తు చేపట్టిది. ఈ రెండు కేసులకు సంబంధించి సందీప్ ఘోష్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.