అయోధ్య బాలరాముడికి మాజీ IAS భారీ కానుక.. 7 కిలోల బంగారు రామాయణం

Ayodhya Ram Lalla Idol: అయోధ్య బాలరాముడికి ఓ ఐఏఎస్ అధికారి భారీ కానుక ఇచ్చాడు. బంగారు రామయాణాన్ని బహుకరించాడు. ఆ వివరాలు..

Ayodhya Ram Lalla Idol: అయోధ్య బాలరాముడికి ఓ ఐఏఎస్ అధికారి భారీ కానుక ఇచ్చాడు. బంగారు రామయాణాన్ని బహుకరించాడు. ఆ వివరాలు..

కోట్లాది మంది హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన అయోధ్య భవ్య రామ మందిరం కల ఈ ఏడాది సాకారం అయ్యింది. అయోధ్యలో అంగరంగ వైభవంగా రామమందిరాన్ని ప్రారంభించి.. బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి ఆలయంలో రామ నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులు.. అయోధ్యలోని బాలరాముడికి భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి బాలరాముడికి ఏకంగా బంగారు రామాయణాన్ని బహుకరించారు. దీని విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ వివరాలు..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఏడు కిలోల ‘బంగారు రాణాయణాన్ని’ బాలరాముడికి కానుకగా అందజేశారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్.. బాలరాముడికి ఈ బంగారు రామయణాన్ని బహుమతిగా ఇచ్చారు. తన జీవితంలో సంపాదించిన మొత్తాన్ని.. బాల రాముడికి అంకితం చేస్తానని ఆలయ ప్రాణప్రతిష్ఠ సమయంలో లక్ష్మీనారాయణ్ ప్రతిజ్ఞ చేశారు.

నాడు చెప్పినట్లుగానే ఇప్పుడు నవమి ముందు.. బాల రాముడి కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసి బంగారు తాపడంతో 151 కిలోల బరువున్న రామచరిత మానస్‌ (రామాయణం)ను ఆయన సిద్ధం చేయించారు. మొత్తం 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణ పుస్తకంలోని ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వాడారని చెప్పుకొచ్చారు. ఈ బంగారు రామాయణం అందరిని ఆకర్షిస్తోంది.

మరోవైపు, ఈ ఏడాది ప్రారంభం అయిన అయోధ్య మందిరంలో మంగళవారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అనగా ఉగాది రోజున కలశ స్థాపనతో 9 రోజుల శ్రీరామనవమి వేడుకలు ఆరంభించారు. బాలరాముడికి పీతాంబరాలు, పట్టువస్త్రాలతో అలంకరించి.. ఇతర వైష్ణవ నామాలను దిద్దారు. వేద పండితులు వాల్మికీ రామాయణంలోని అనేక భాగాలను నిత్యం పారాయణం చేస్తున్నారు. నవమి వేడుకల కోసం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలి వస్తున్నారు.

Show comments