iDreamPost
android-app
ios-app

రైతులకు గుడ్ న్యూస్! ఈ-ట్రాక్టర్ వస్తోంది..కిలో మీటర్ కు రూ.14 ఖర్చు!

Electric Tractor: ఇప్పటి వరకు మనం ఎలక్ట్రికల్ కారులు, బైకులను మాత్రమే చూశాము. అలానే త్వరలో ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ను కూడా చూడనున్నాము. ఇది రైతులకు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి..ఆ ఈ-ట్రాక్టర్ కు సంబంధించిన వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

Electric Tractor: ఇప్పటి వరకు మనం ఎలక్ట్రికల్ కారులు, బైకులను మాత్రమే చూశాము. అలానే త్వరలో ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ను కూడా చూడనున్నాము. ఇది రైతులకు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి..ఆ ఈ-ట్రాక్టర్ కు సంబంధించిన వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

రైతులకు గుడ్ న్యూస్! ఈ-ట్రాక్టర్ వస్తోంది..కిలో మీటర్ కు రూ.14 ఖర్చు!

మన దేశంలోని ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వివిధ రకాల పంటలు పండిస్తూ..రైతులు దేశాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వ్యవసాయం కోసం అనేక రకాల వస్తువులను, వాహనాలను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ట్రాక్టర్ అనేది వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది. దానికి అవసరమయ్యే ఇంధనం, ఇతర ఖర్చులు రైతులకు భారమనే చెప్పాలి. టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటికాలంలో రైతులకు ఉపయోగపడే అనేక వస్తువులు, సాధనలు అందుబాటులోకి వచ్చాయి. ఇలానే తాజాగా ట్రాక్టర్ విషయంలో కూడా రైతులకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పొచ్చు. త్వరలో  ఎలక్ట్రానికి ట్రాక్టర్ అందుబాటులోకి రానుంది.

ఇప్పటి వరకు మనం ఎలక్ట్రికల్ కారులు, బైకులను మాత్రమే చూశాము. అలానే త్వరలో ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ను కూడా చూడనున్నాము. అలానే ఈ-ట్రాక్టర్ వస్తే ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ట్రాక్టర్ నిర్వహణ కు అయ్యే ఖర్చులను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కుబోటా, మహీండ్రా, హెచ్ఏవీ, సోనాలికా ట్రాక్టర్ కంపెనీలు ఈ ట్రాక్టర్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కంపెనీలు ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ నమూనాను చూపించాయి.

Auto Nxt స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఈ కంపెనీ ఎలక్ట్రానికి ట్రాక్టర్ కోసం లెవల్ 3 అటానమస్ సాంకేతికతను వాడుతున్నట్లు ఆటో ఎన్ఎక్స్ టీ కంపెనీ సీఈఓ కౌస్తుభ్ ధోండే చెప్పారు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ కూడా తమ కంపెనీలో వచ్చే సంవత్సరం లోపు వస్తుందని సీఈఓ తెలిపారు. ఇక ఈ ట్రాక్టర్ గురించి ఆయన పలు విషయాలను వెల్లడించారు. డీజిల్ ట్రాక్టర్ తో పోలీస్తే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కు నిర్వహణ ఖర్చుకు తక్కువ ఉంటుందని ధోండే అన్నారు. డీజిల్ ట్రాక్టర్ కిలో మిటర్ కు  రూ.93లు ఖర్చు అవుతుందని, అదే ఈ ట్రాక్టర్ కేవలం రూ.14 లు మాత్రమే ఖర్చు వస్తుందని ఆయన పేర్కొన్నారు. డీజిల్ ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ల ఇంజన్ పవర్ కూడా అధికంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక ఈ ఎలక్ట్రక్ ట్రాక్టర్ ను కంపెనీ ఛార్జర్ తో మూడు గంటల్లో ఛార్జింగ్ పెడితే సరిపోతుందని కౌస్తుబ్ ధోండే అంటున్నారు.

2025 ఆర్థిక సంవత్సరానికి 100 ఈ ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురావాలని ఆటో ఎన్ఎక్స్ టీ కంపెనీ ట్రై చేస్తోందని తెలిపారు. ఈ ట్రాక్టర్ గానీ రైతులకు అందుబాటులోకి వస్తే..వ్యవసాయ ఖర్చులు కొత్త మేరక తగ్గినట్లే అవుతుంది. ఇప్పటికే పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల ఖర్చు కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు. చాలా మంది రైతులు అప్పులో కూరుకుపోయి..విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు శాస్త్రవేత్తలు రైతులకు ఖర్చు తగ్గించే విధంగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక వ్యవసాయ సాధానాలు వచ్చాయి. త్వరలో ఈ ట్రాక్టర్ కూడా రానుంది.