Fact Check: ఓటు వేయకపోతే.. మీ అకౌంట్ నుండి రూ.350 కట్ అంటూ ప్రచారం! ఇందులో నిజమెంత?

ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇంతకు అది నిజమేనా... అంటే..

ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇంతకు అది నిజమేనా... అంటే..

దేశంలో ఒకవైపు లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అలానే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన రాజకీయ వార్తలే దర్శనం ఇస్తున్నాయి. ఇక ఇపుడు ఎన్నికల ప్రచారం కొత్త మార్గాల్లో సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ తో పాటు ఫేక్ వార్తలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజా ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయనే ప్రచారం జోరందుకుంది. మరి ఇంతకు ఇది నిజమేనా అంటే..

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ. 350 జరిమానా ఉంటుందని, ఈ మెత్తం సదరు ఓటరు బ్యాంకు ఖాతా నుంచి కట్‌ అవుతుందంటూ గత కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాక బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేని ఓటర్లకు సంబంధించి.. వారు మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఆ మొత్తం జరిమానా కింద కట్‌ అవుతుందని ప్రచారం చేస్తున్నారు.

అలా ఈ వార్త కాస్త ఎన్నికల సంఘం దృష్టికి చేరింది. దాంతో ఈసీ దీనిపై స్పందించింది. ఓటు వేయకపోతే డబ్బుల కట్ అవుతాయంటూ సాగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ప్రకటించింది. ఎన్నికల కమిషన్ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ ప్రచారం అబద్ధమని పేర్కొంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది.

Show comments