iDreamPost
android-app
ios-app

ఇదెక్కడి విడ్డూరం.. వేలంపాటలో సర్పంచ్ ఎన్నిక.. ఏకంగా రూ.2 కోట్లు..!

ఎన్నికలు అంటే ఆ హడావుడే వేరు. అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గెలుపుకోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అదే ఏకగ్రీవం కావాలనుకుంటే అంగ, అర్థబలంతో ఏదో జిమ్మిక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ సర్పంచి ఎన్నిక..

ఎన్నికలు అంటే ఆ హడావుడే వేరు. అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గెలుపుకోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అదే ఏకగ్రీవం కావాలనుకుంటే అంగ, అర్థబలంతో ఏదో జిమ్మిక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ సర్పంచి ఎన్నిక..

ఇదెక్కడి విడ్డూరం.. వేలంపాటలో సర్పంచ్ ఎన్నిక.. ఏకంగా రూ.2 కోట్లు..!

వేలం పాటలో గణపతి లడ్డూను దక్కించుకోవడం గురించి తెలుసు. ఈఐఎం కట్టకపోతే ఇల్లు, వాహనాలను బ్యాంకులు స్వాధీనం చేసుకుని వేలం వేయడం చూశారు.  కానీ సర్పంచిని వేలం పాటలో ఎంచుకోవడం గురించి విన్నారా..? నిజమేనండి ఈ వింతైన ఎంపిక పంజాబ్‌లో చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగునున్నాయి. 3,237 సర్పంచ్ స్థానాలకు అక్టోబరు 15న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కొన్ని స్థానాల్లో ఏకగీవ్రంగా అభ్యర్థులను ఎంచుకున్నారు. కానీ ఓ గ్రామంలో వేలం పాటలో సర్పంచిని ఎంచుకున్నారు. ఈ పదవి కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెట్డడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలు ఏవైనా హోరా హోరీ పోరు నడుస్తుంది. రాజకీయ ప్రత్యర్థులు తమ గెలుపు కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఇంటింటా ప్రచారం చేయడంతో పాటు హామీలను గుప్పిస్తుంటారు. ఇక పోటీలో ఎవరు నిలవకూడదు, పోలింగ్ లేకుండా తామే ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలనుకునే అభ్యర్థులు అంగ బలం, అర్థబలంతో ట్రై చేస్తుంటారు. ఇక ఇదే జరిగింది పంజాబ్ పంచాయతీ ఎన్నికల్లో. గురుదాస్‌పుర్‌ జిల్లాలోని హర్దోవల్‌ కలన్‌ గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కావాలనుకున్నారు. ఇందు కోసం వేలం పాట నిర్వహించారు. ఎవరు ఎక్కువ బిడ్డింగ్ చేస్తే వారే విజేతలు. రూ. 50 లక్షలతో వేలం పాట మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. స్థానిక బీజేపీ నేత ఆత్మా సింగ్ ఏకంగా రూ. 2 కోట్లు బిడ్డింగ్ వేశారు. సోమవారంతో వేలం పాటకు గడువు ముగిసింది.

ఇప్పటి వరకు అత్యధిక బిడ్డింగ్ వేసింది ఆత్మా సింగే కావడం గమనార్హం. దీంతో అతడే సర్పంచిగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి ఎవరు ఎక్కువ నిధులు ఇస్తారో వారినే సర్పంచిగా ఎన్నుకుంటారని సదరు నేత ఈ వేలం పాటను సమర్థించుకుంటున్నారు. వేలం పాట ద్వారా కోట్లు కుమ్మరించి సర్పంచి పదవిని దక్కించుకోవడంపై రాజకీయ దుమారం మొదలైంది.  ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మాత్రం ఈ ఎంపికపై ఫైర్ అవుతుంది. ఈ ఎంపిక అక్రమం, అన్యాయం  అంటూ గగ్గోలు పెడుతోంది.

ఇది బహిరంగమైన అవినీతి చర్య అని, ఇలాంటి ఎన్నిక అధికారికం కాదని, దీనిపై దర్యాప్తు చేసి, బాధ్యులను జైలుకు పంపాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించి.. విచారణకు ఆదేశించారు. ఇదెక్కడొచ్చిన సమస్య.. ఏకగ్రీవంగా ఎన్నికవుదామంటే.. కొత్త సమస్య వచ్చిందే అనుకున్న ఆత్మా సింగ్..  సర్పంచ్ ఎన్నికకు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు.  ఇదే కాదు. బటిండా జిల్లాలోని గెహ్రి బత్తార్‌ గ్రామంలోనూ ఇలాగే వేలం ప్రక్రియ నిర్వహించగా.. రూ.60 లక్షలు పలికినట్లు తెలుస్తోంది.  ఇక ఆత్మా సింగ్ ఎంపిక ఏకగ్రీవం అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.