Dharani
Elections 2024: మరి కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది జీత భత్యాల వివరాలు మీ కోసం..
Elections 2024: మరి కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది జీత భత్యాల వివరాలు మీ కోసం..
Dharani
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో దశలో భాగంగా రేపు అనగా సోమవారం, మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఎలాంటి ఆటంకం లేకుండా పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఎలక్షన్ నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైత షెడ్యూల్ వచ్చిన తర్వాత దేశంలోని వ్యవస్థలతోపాటు పాలనపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇందుకోసం ప్రభుత్వంలోని అన్ని విభాగాల సిబ్బంది రాత్రిపగలు శ్రమిస్తుంటారు. కొందరు రోజు వారి విధుల్లో పాల్గొంటే మరికొందరు పోలింగ్, కౌంటింగ్ ఇతర ప్రక్రియల్లో పాల్గొంటారు. ఇలా ఎన్నికల్లో విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం ప్రత్యేక జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి గాను.. ఇప్పటి వరకు ఇచ్చే రెమ్యూనిరేషన్ పై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి మార్చి 13నే ఆమోదం తెలిపింది.
దీని ప్రకారం.. ఈ ఏడాది ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారులు, సిబ్బందికి.. గత ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యునరేషనే కొనసాగించనున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన వేతనాన్నే ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ క్రింది బాధ్యతల్లో ఉన్న వాళ్లు అందుకునే రెమ్యూనిరేషన్ ఇలా ఉంటుంది.