iDreamPost
android-app
ios-app

UGC NET 2024 వివాదంలో సంచలన నిజాలు! రూ.500కే క్వశ్చన్ పేపర్ లీక్!

UGC NET 2024: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష(నెట్)-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. తాజాగా ఈ ఇష్యుపై కేంద్ర మంత్రి కీలక అంశాలను వెల్లడించారు.

UGC NET 2024: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష(నెట్)-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. తాజాగా ఈ ఇష్యుపై కేంద్ర మంత్రి కీలక అంశాలను వెల్లడించారు.

UGC NET 2024 వివాదంలో సంచలన నిజాలు! రూ.500కే క్వశ్చన్ పేపర్ లీక్!

యూజీసీ నెట్-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. దీంతో ఇటీవలే ఈ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ ఇష్యూకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాక పరీక్ష ఇష్యూపై విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నాయి. అంతేకాక తమకు న్యాయం జరగాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూజీసీ నెట్ రద్దుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. ఈ పరీక్షను రద్దు చేయడం అనేది ఆకస్మికనిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఇష్యూ గురించి కేంద్ర మంత్రి అనేక విషయాలను వెల్లడించారు.

యూజీసీ నెట్-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. అలానే ఈ పరీక్ష రద్దు చేయడం అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయ కాదని తెలిపారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం డార్క్ నెట్ లో లీక్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అయినా ‘టెలిగ్రామ్’ ద్వారా ఈ పేపర్ లు షేర్ అయిన్లటు తమకు ఆధారాలు లభించాయని ఆయన తెలిపారు. ప్రక్కా సమాచారం, ఫ్రూప్స్ ఉండటంతో నే యూజీసీ పరీక్షను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్, డార్క్‌నెట్  ద్వారా ఈ   క్వశ్చన్ పేపర్లను  రూ.500 నుంచి 5 వేల వరకు విక్రయించినట్లు తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే యూడీసీ నెట్ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు.

యూజీసీ, నెట్, నీట్ పరీక్షలకు సంబంధించిన ఇష్యూలపై కేంద్ర ప్రభుత్వం  విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే నీట్ యూజీ-2024 పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిపిన విచారణలో పలు ప్రాంతాల్లో అక్రమాలు జరిగినట్లు ఫ్రూప్ లు దొరికాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ఈ ఘటనలో అవినీతికి పాల్పడిన, నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తామని అభ్యర్థులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు,కీలక అంశాలను తెలుసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ కమిటితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా పరిశీలిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనానికే తొలి ప్రాధాన్యతనిస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరి.. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.