iDreamPost
android-app
ios-app

మంత్రి పనిమనిషి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు..30 కోట్లు సీజ్

  • Published May 06, 2024 | 1:43 PM Updated Updated May 06, 2024 | 1:43 PM

ED Officials Found Cash: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతుంది. ఈ క్రమంలోనే అక్రమండా డబ్బు తరలిస్తున్న వారిపి ఈసీ కొరడా ఝులిపిస్తుంది.

ED Officials Found Cash: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతుంది. ఈ క్రమంలోనే అక్రమండా డబ్బు తరలిస్తున్న వారిపి ఈసీ కొరడా ఝులిపిస్తుంది.

మంత్రి పనిమనిషి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు..30 కోట్లు సీజ్

దేశంలో ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి ఆభరణాలు, పట్టు చీరలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఓటర్లను ఎలాగైన ప్రలోభ పెట్టి తమకే ఓటు వేయించుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు పలువురు రాజకీయ నేతలు. మరోవైపు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన నగదు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్ రాష్ర్ట కాంగ్రెస్ నేత, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ పీఎ సంజీవ్ లాల్ పనిమిని ఇంట్లో ఈడీ అధికారులు దాడి చేసి భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిచ్చాయని ఓ అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల జార్ఖండ్ గ్రామీణాభివృద్ది శాఖలో పేద ప్రజల కోసం అమలు చేసిన పథకాల్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ ని అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి ఈడీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ధ్రువలోని సెల్ సిటీ ప్రాంతం సహా మొత్తం తొమ్మిది చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సదరు మంత్రి పీఏ సంజీవ్ లాల్ పనిమనిషి ఇంట్లో దాడి చేయగా అధికారుల కళ్లు తిరిగాయి. ఎక్కడ చూసినా 500 నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. కాగా, సీజ్ చేసిన నగదు మొత్తం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే సంజీవ్ లాల్ పనిమనిషిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అతని బ్యాంక్, వ్యక్తిగత పత్రాలపై సోదీలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే జార్ఖండ్ కి చెందిన అలంగీర్ ఆలం కాంగ్రెస్ సీనియర్ నేత. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ది మంత్రి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అలంగీర్ 2006 నుంచి 2009 వరకు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సమయంలో కోట్ల కొద్ది డబ్బు పంపిణీ చేస్తూ ఒటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.