iDreamPost
android-app
ios-app

పర్యావరణానికి హాని చేయకుండా పెళ్లి.. ఈ డాక్టరమ్మకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

  • Published Jun 07, 2024 | 7:55 PM Updated Updated Jun 07, 2024 | 8:06 PM

Zero Waste Wedding: నేటి రోజుల్లో పెళ్లంటే గ్రాండ్ గా ఖర్చు చేసేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కువైపోయింది. అన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే భోజనం తినగా మిగిలిపోయిన పేపర్ ప్లేట్లు, గ్లాసులు ఇలా ఆ వేస్ట్ అంతా వేస్ట్ గానే పోతుంది. కానీ ఈ డాక్టరమ్మ పర్యావరణం గురించి ఆలోచించి ఎకోఫ్రెండ్లీ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

Zero Waste Wedding: నేటి రోజుల్లో పెళ్లంటే గ్రాండ్ గా ఖర్చు చేసేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కువైపోయింది. అన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే భోజనం తినగా మిగిలిపోయిన పేపర్ ప్లేట్లు, గ్లాసులు ఇలా ఆ వేస్ట్ అంతా వేస్ట్ గానే పోతుంది. కానీ ఈ డాక్టరమ్మ పర్యావరణం గురించి ఆలోచించి ఎకోఫ్రెండ్లీ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

పర్యావరణానికి హాని చేయకుండా పెళ్లి.. ఈ డాక్టరమ్మకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

పెళ్లి అంటే ఆర్భాటంగా చేయాలని మనవాళ్ళు భావిస్తుంటారు. దాని కోసం లక్షలు లక్షలు ఖర్చు చేస్తుంటారు. డబ్బులు లేకపోయినా గానీ అప్పు చేసి మరీ గ్రాండ్ గా పెళ్లి జరిపిస్తారు. అయితే ఈ పెళ్లి వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. కొంతమంది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని జీరో-వేస్ట్ వెడ్డింగ్ కాన్సెప్ట్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా ఓ డాక్టరమ్మ కూడా జీరో-వేస్ట్ కాన్సెప్ట్ లోనే వివాహం చేసుకున్నారు. ఆ డాక్టరమ్మ పేరు పూర్వీ భట్. ఈమె ఒక న్యూట్రిషనిస్ట్. ఈమె బెంగళూరులోని తన స్వగ్రామంలో జీరో వేస్ట్ వెడ్డింగ్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎకో ఫ్రెండ్లీ వివాహం చేసుకున్నా అని ఆమె ఒక వీడియోని విడుదల చేశారు.

ఇలా పెళ్లి చేసుకోవడం తన కల అని.. తన కుటుంబం సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని ఆమె అన్నారు. కాలుష్యం కోరల నుంచి భూదేవి తల్లిని కాపాడుకునేందుకు ఇలాంటి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా అని.. దానికి తన తల్లి సహకారం తోడైందని.. ఆమె సహకారంతో జీరో వేస్ట్ వెడ్డింగ్ చేసుకోగలిగానని అన్నారు. దీన్ని జీరో వేస్ట్ వెడ్డింగ్ గా నిపుణులు పరిగణిస్తారో లేదో తనకు తెలియదని.. కానీ ఈ వేడుకలో తాము ప్లాస్టిక్ ని జనరేట్ చేయలేదని ఆమె అన్నారు. తన తల్లిదండ్రుల వల్లే జీరో వేస్ట్ వెడ్డింగ్ కల సాకారం అయ్యిందని అన్నారు. తన తల్లి చాలా తెలివైనవారని.. ఆమెనే మొత్తం ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారని తెలిపారు.

చెరకు గడలతో పెళ్లి మండపాన్ని చేయడం, డెకరేషన్ కోసం మామిడి ఆకులు, కొబ్బరి ఆకులని ఉపయోగించారు. అరటి ఆకుల్లో భోజనాలు వడ్డించారు. ఇక వధూవరులు వేసుకునే దండలు కూడా పువ్వులు, పత్తి దారాలతో తయారు చేసినవే. వచ్చిన అతిథులందరికీ బహుమతిగా జ్యూట్ బ్యాగ్ లను ఇచ్చారు. ఏ మొత్తం పెళ్లి వేడుకలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ ని గానీ, పేపర్ ని గానీ ఉపయోగించలేదని అన్నారు. పెళ్లి అయ్యాక చెరకుగడలను ముక్కలు చేసి ఆవులకు తినిపించారు. మామిడి ఆకులను, కొబ్బరి ఆకులను, అరటి ఆకుల వేస్టేజ్ ని పొలాలకు కంపోస్ట్ ఎరువుగా మార్చారు.

అంతేకాదు.. పెళ్ళిలో వినియోగించే నీరు కూడా వృథా కాకుండా వాడిన నీరంతా చెట్లకు వెళ్లేలా చేశారు. ఇలా పెళ్ళిలో ఏది వాడినా గానీ ఆ వస్తువు భూమిలోకి ఇంకిపోయేదై ఉండాలి లేదా పశువులకు మేత అయినా అయి ఉండాలి అని ఆలోచించి ఈ పెళ్లి వేడుకను జరుపుకున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వినియోగించి.. పర్యావరణానికి హాని చేసేకంటే ఇలా ఎకో ఫ్రెండ్లీ పెళ్లి చేసుకోవడంలోనే ఎక్కువ సంతోషంగా ఉందని ఆమె అన్నారు. దీంతో నెటిజన్స్ హ్యాట్సాఫ్ డాక్టరమ్మ అంటూ మెచ్చుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dr.Poorvi Bhat | Nutrition & Wellness (@herbeshwari)