iDreamPost
android-app
ios-app

రైలు చివ‌ర‌న ‘ X’ గుర్తు ఎందుకు ఉంటుంది.. దాని అర్థం ఏంటో తెలుసా?

  • Published Jul 03, 2024 | 1:39 PM Updated Updated Jul 03, 2024 | 1:39 PM

Train Last Coach Purpose of X Symbol: దేశంలో ప్రతిరోజూ కోటి మందికి పైగా ప్రయాణికులు రైల్లో ప్రయాణం చేస్తుంటారు. రైలు ప్రయాణం చౌక మాత్రమే కాదు.. సురక్షితం, సౌకర్యవంతంగా భావిస్తుంటారు.

Train Last Coach Purpose of X Symbol: దేశంలో ప్రతిరోజూ కోటి మందికి పైగా ప్రయాణికులు రైల్లో ప్రయాణం చేస్తుంటారు. రైలు ప్రయాణం చౌక మాత్రమే కాదు.. సురక్షితం, సౌకర్యవంతంగా భావిస్తుంటారు.

రైలు చివ‌ర‌న ‘ X’ గుర్తు ఎందుకు ఉంటుంది.. దాని అర్థం ఏంటో తెలుసా?

మన దేశంలో సురక్షితమైన, చవకైన రవాణా సాధనం ఏదీ అంటే వెంటనె చెప్పే పేరు రైలు బండి. సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. బస్సులో ప్రయాణం అంత సౌకర్యవంతంగా ఉండదు కనుక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రైలు ప్రయాణాలకే జై కొడుతుంటారు. దేశ వ్యాప్తంగా కొన్నివేల కిలోమీటర్ల వరకు విస్తరించిన రైల్వేలు ప్రతి రోజూ కోటిన్నర మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. రైలు ప్రయాణం ఎంతో సంతోషాన్ని అందిస్తుందని పిల్లలు, పెద్దలు తమ అనుభవాల గురించి చెబుతుంటారు. అయితే రైలు ప్రయాణం చేసేవారు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. వివరాల్లోకి వెళితే..

దేశంలో చాలా మంది ఏదో ఒక పనిపై రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైల్వే స్టేషన్, రైలు, రైల్వే ట్రాక్ ఇరు వైపుల కొన్ని బోర్డులపై సింబల్స్ ఉంటాయి. కొన్ని అక్షరాలు, నెంబర్లు, సింబల్స్ రూపంలో ఉంటాయి.. వాటి వెనుక ఎంతో అర్థం ఉంటుంది. సాధారణంగా ట్రైన్ ముందు వెనుక భాగంలో చివరి బోగీపై తెలుపు లేదా పసుపు రంగుతో ‘X’ గుర్తు కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే.. ఈ రైలుకు చివరి బోగీ ఇదే అని. ప్రయాణంలో ఎటువంటి కోచ్ లను రైలు వదల్లేదని.. అన్నింటికి తీసుకువెళ్తుందని దాని అర్థం. ఒకవేళ చివరి బోగీపై ‘X’ గుర్తు లేకపోతే ఆ రైలుకు ఏదో ప్రమాదం జరిగి ఉండవొచ్చని అర్థం వస్తుంది. స్టేషన్ మాస్టర్ నుంచి రైలు క్రాసింగ్ అవుతున్న సమయంలో గార్డు ‘X’ మార్కును గుర్తించి అన్ని బోగీలు సురక్షితంగా ఉన్నాయని కన్ఫామ్ చేసుకొని ఆకుపచ్చ జెండాను చూపిస్తారు.

ఒకవేళ చివరి బోగీపై ‘X’ గుర్తు కనిపించకపోతే.. స్టేషన్ మాస్టర్ వెంటనే హెచ్చరికను జారీ చేస్తారు. దీంతో అధికారులు అప్రమత్తమవుతారు. అయితే ‘X’ గుర్తుతో పాటు LV అనే అక్షరాలు రాసి ఉంటాయి.. అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. రైలు మధ్యలో ఉండే బోగీలు, ముందు ఉండే బోగీలకు ఎక్కడ ఇలాంటి గుర్తులు ఉండవు. కేవలం చివరి బోగీకి మాత్రమే ఉంటుంది. అలాగే చివరి బోగీపై ఎరుపు రంగు లైట్ ఉంటుంది.. రాత్రి వేళ ఈ బోగీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.