iDreamPost
android-app
ios-app

ప్రభుత్వం అందించే బ్లూ ఆధార్‌ కార్డు గురించి తెలుసా? ఎవరి కోసం ఇస్తారంటే?

  • Published Feb 10, 2024 | 7:13 PM Updated Updated Feb 10, 2024 | 7:13 PM

ఆధార్ కార్డు ప్రభుత్వ, ప్రైవేట్ పనుల కోసం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలకు, బ్యాంకుల్లో లావాదేవీలకు, ఆస్తుల క్రయ విక్రయాలకు ఆధార్ ఎంతో కీలకం. మరి ప్రభుత్వం అందించే బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా?

ఆధార్ కార్డు ప్రభుత్వ, ప్రైవేట్ పనుల కోసం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలకు, బ్యాంకుల్లో లావాదేవీలకు, ఆస్తుల క్రయ విక్రయాలకు ఆధార్ ఎంతో కీలకం. మరి ప్రభుత్వం అందించే బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా?

  • Published Feb 10, 2024 | 7:13 PMUpdated Feb 10, 2024 | 7:13 PM
ప్రభుత్వం అందించే బ్లూ ఆధార్‌ కార్డు గురించి తెలుసా? ఎవరి కోసం ఇస్తారంటే?

ఆధార్ కార్డు కీలకమైన గుర్తింపు పత్రాల్లో ఒకటి. భారతీయ పౌరుల కోసం కేద్ర ప్రభుత్వం 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన ఆధార్ కార్డును జారీ చేసింది. ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరంగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందడానికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. అదే విధంగా ఐడెంటిటీ కోసం కూడా ఆధార్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2010లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో మీ పేరు, చిరునామా, డేటాఫ్ బర్త్ మాత్రమే కాకుండా మీ వేలి ముద్రలను కూడా సేకరించి ఆధార్ కార్డును జారీ చేస్తారు. మరి ప్రభుత్వం అందిస్తున్న బ్లూ ఆధార్ కార్డు గురించి మీకు తెలుసా? ఈ ఆధార్ కార్డును ఎవరికీ ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ) బ్లూ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. దీన్నే బాల ఆధార్ గా పేర్కొంటారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బాల ఆధార్‌ ను ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తుంది. అయితే పిల్లల వయసు ఐదేళ్లు దాటితే ఈ బాల ఆధార్ పనిచేయదు. అప్పుడు ఫింగర్ ప్రింట్స్, వేలిముద్రలు వంటి వివరాలతో ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లూ ఆధార్ ను ఐదేళ్ల లోపు పిల్లల ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి సమాచారంతో పొందొచ్చు. ఈ బ్లూ ఆధార్ కార్డును తల్లిదండ్రుల ఆధార్‌ సంఖ్యతో అనుసంధానిస్తారు. బ్లూ ఆధార్ కార్డు పిల్లలకు ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్థి పొందడానికి, పాఠశాలల్లో జాయిన్ చేసేటపుడు ఉపయోగపడుతుంది. అయితే ఈ బ్లూ ఆధార్ నమోదు చేసుకోవడానికి సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి కావాల్సిన పత్రాలను, సమాచారాన్ని అందించి పొందొచ్చు.

బాల ఆధార్‌ ఎలా పొందొచ్చంటే:

  • తల్లిదండ్రులు దగ్గర్లోని ఆధార్ సెంటర్ కు తమ పిల్లల బర్త్ సర్టిఫికేట్, ఫొటో, అడ్రస్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి.
  • ఆధార్ సెంటర్ లో అన్ని వివరాలతో ఫామ్ ను ఫిల్ చేసి, తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలను, ఫోన్ నెంబర్ ను కూడా అందజేయాలి.
  • ధృవీకరణ అనంతరం నమోదు ప్రక్రియ పూర్తైనట్లు మీ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది.
  • తర్వాత మీరిచ్చిన పత్రాలను ధ్రువీకరిస్తారు. వెంటనే మొబైల్‌ నంబర్‌కు నమోదు ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది.
  • అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌ని తీసుకోవడం మర్చిపోవద్దు. అందులో ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఉంటుంది. దీంతో మీ పిల్లల ఆధార్‌ కార్డు అప్లికేషన్‌ వివరాలను పొందొచ్చు.
  • 60 రోజుల్లోగా మీ పిల్లల పేరుపై బాల ఆధార్‌ కార్డును జారీ చేస్తారు. ప్రభుత్వం ఉచిత సర్వీసుతో బ్లూ ఆధార్‌ కార్డు జారీ చేస్తుంది.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet