iDreamPost
android-app
ios-app

వీడియో: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్!

  • Published May 06, 2024 | 12:12 PM Updated Updated May 06, 2024 | 12:13 PM

DK Shivakumar Issue: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహం చివరి దశకు చేరుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం పార్టీ అధినేతలు ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు.

DK Shivakumar Issue: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహం చివరి దశకు చేరుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం పార్టీ అధినేతలు ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు.

  • Published May 06, 2024 | 12:12 PMUpdated May 06, 2024 | 12:13 PM
వీడియో: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్!

త ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి డీకే శివకుమార్. ఈ కారణంతోనే ఆయనను డిప్యూటీ సీఎం‌గా నియమించారు. సాధారణంగా సెలబ్రెటీలు,ప్రముఖ రాజకీయ నేతలు ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే అభిమానులు, కార్యకర్తలు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. దీంతో నటులు, రాజకీయ నేతలు తీవ్ర అసహనానికి గురైతుంటారు.. కొన్నిసార్లు సెల్పీ కోసం వచ్చిన వారిపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి ఘటనే ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. ఓ అభిమాని చేసిన ఓవర్ యాక్షన్ కి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివాలెత్తిపోయారు. అక్కడ ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎంత సౌమ్యంగా ఉంటారో.. కోపం వస్తే అంత రౌద్రంగా మారుతారని అంటారు. తాజాగా జరిగిన సంఘటనే ఓ ఉదాహారణ. వివరాల్లోకి వెళితే.. నవరూరు పట్టణంలోన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి వినోదా అసూటి ప్రచారంలో పాల్గొనడానికి శివకుమార్ వచ్చారు. ఆయన కారు దిగగానే స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తల తరలివచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత, మున్సిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భుజంపై చేయి వేసి ఫోటో తిసుకునే ప్రయత్నం చేశారు. అంతే ఒక్కసారే కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆ కార్యకర్త చెంప చెల్లుమనిపించి పక్కకు నెట్టారు. దీంతో కాంగ్రెస్ నేత ఒక్కసారే షాక్ తిన్నారు.  అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లారు.

గతంలో కూడా శివ కుమార్ తనతో దురుసుగా ప్రవర్తించిన కార్యకర్తలపై చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి లోక్ సభ లో కూడా సత్తా చాటేందుకు కృషి చేస్తుంది. కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలు ఉండగా ఏప్రిల్ 26న 14 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి తరుపు నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన డీకే శివకుమార్ హవేరీకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.