iDreamPost
android-app
ios-app

కొంపముంచిన DJ.. ఆసుపత్రిలో చేరిన 250 మంది

మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా అన్నట్లుగా.. నిజంగానే డీజే సాండ్స్ వినిపిస్తే చాలు ఒళ్లు మైమరిచిపోతుంటాం. కానీ ఇదే డీజే 250 మంది కొంపముంచింది.

మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా అన్నట్లుగా.. నిజంగానే డీజే సాండ్స్ వినిపిస్తే చాలు ఒళ్లు మైమరిచిపోతుంటాం. కానీ ఇదే డీజే 250 మంది కొంపముంచింది.

కొంపముంచిన DJ.. ఆసుపత్రిలో చేరిన 250 మంది

వేడుకేదైనా డీజే ఉండాల్సిందే. పెళ్లి వేడుక, మెచ్యూర్ ఫంక్షన్, దేవుళ్ల ఊరేగింపు, పొలిటికల్ ర్యాలీ ఏదైనా సరే.. డీజే బాక్సులు పగులిపోయేలా పెద్ద పెద్ద సౌండ్లతో ఆ ప్రాంతమంతా మారుమోగాల్సిందే. ఇటీవల కాలంలో డీజే లేనిదే ఫెస్టివల్ కావడం లేదు. ‘డీజే కొట్టు కొట్టు.. డీజే కొట్టు’ అంటూ చిందులేయాల్సిందే. ఈ సౌండ్ కు అక్కడ ఉన్న చిన్నా, పెద్దా, ముసలి, ముతక, యువకులు ఒళ్లు మైమరచి చిందులేయాల్సిందే. సినిమా, ఫోక్ సాంగ్స్‌కు తమదైన స్టైల్లో డీజేలు కొడుతూ.. అక్కడ ఉన్నవారిని హుషారు తెప్పిస్తుంటారు. కానీ ఇదే డీజే సౌండ్స్ వల్ల సుమారు 250 మంది ఆసుపత్రి పాలయ్యారంటే నమ్ముతారా..? నిజంగా నిజం. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని క్రాంతి చౌక్‌లో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పూణె నుండి 15 మంది డీజేలను ఆహ్వానించారు. ఇక వచ్చిన నాటి నుండి ఒకటే డీజే కొడుతూనే ఉన్నారు. ఆ డీజే సౌండ్స్ కు కుర్రాళ్లు ఉర్రూతలూగిపోయారు. వారి హుషారు చూసి డీజేలు సైతం మరింత సౌండ్స్ పెంచారు. హోరెత్తే మ్యూజిక్‌తో పాటు బాక్సులు బద్దలు అయ్యే విధంగా సౌండ్స్ పెంచడంతో చుట్టు ప్రక్కల పెద్ద వాళ్లకు చెవులు దెబ్బలు తిన్నాయి. చిల్లలు పడేలా మ్యూజిక్ వస్తుంటే.. మరింత జోష్‌గా డ్యాన్సులు, స్టెప్పులతో మరింత ఊగిపోయారు. ఇక మెల్లిగా తలలు మొద్దుబారడం ప్రారంభం అయ్యాయి.

నెమ్మదిగా చెవులు వినిపించడం మానేశాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చెవ్వుల్లో గియ్ మనే శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఇంట్లో ఎవరు ఏదీ చెప్పినా వినబడం లేదు. కొంత మందికి చెవి పోటు కూడా మొదలైంది. దీంతో మెల్లిగా ఆసుపత్రిలో చేరడం మొదలు పెట్టారు. ఆ చుట్టు ప్రక్కల ప్రాంతంలోని ప్రజలు మెల్లిగా ఆసుపత్రిలో చేరారు. అలా 250 మంది హాస్పిట్లలో చేరారు. ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. ఏం జరిగిందని తెలిసి.. విచారణ చేపట్టారు. డెసిబెల్స్ సౌండ్స్ 150 దాటిందని గుర్తించి, శబ్ద కాలుష్యానికి కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికీ కొంత మంది చికిత్స పొందుతున్నారని తెలిసింది.