iDreamPost
android-app
ios-app

బతుకుదెరువు కోసం రిక్షా తొక్కి.. ఓ ఐడియాతో కోట్లు సంపాదించాడు!

Success Story: క‌ష్టంలో నుంచి వ‌చ్చే క‌సితో.. పోరాటం చేస్తే జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకోవ‌చ్చ‌ని చాలా మంది విజేతలు నిరూపించారు. పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం అనే మాటలు నిజ జీవితంలో అక్షర సత్యాలని నిరూపించారు. అలాంటి వారిలో ఒకరే దిల్ ఖుష్ సింగ్. ఆయన సక్సెస్ స్టోరీ ఎందరికో ఆదర్శం.

Success Story: క‌ష్టంలో నుంచి వ‌చ్చే క‌సితో.. పోరాటం చేస్తే జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకోవ‌చ్చ‌ని చాలా మంది విజేతలు నిరూపించారు. పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం అనే మాటలు నిజ జీవితంలో అక్షర సత్యాలని నిరూపించారు. అలాంటి వారిలో ఒకరే దిల్ ఖుష్ సింగ్. ఆయన సక్సెస్ స్టోరీ ఎందరికో ఆదర్శం.

బతుకుదెరువు కోసం రిక్షా తొక్కి.. ఓ ఐడియాతో కోట్లు సంపాదించాడు!

నేటికాలంలో చిన్న చిన్న అపజయాలకే కుంగిపోయే యువత ఎక్కువయ్యారు. జీవితంలో అన్ని సక్రమంగా ఉంటేనే ముందుకెళ్తారు.. కానీ ఏ చిన్న కష్టం వచ్చిన తట్టుకోలే పోతున్నారు. ఇక జీవితం వృథా అంటూ తీవ్ర కుంగుబాటుకు గురవుతుంటారు. అయితే ఇలాంటి వారికి స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చే వారు కొందరు ఉంటారు. వారిని టార్చ్ బేరర్ అంటారు. అలాంటి వాళ్లు కష్టంలో నుంచి వ‌చ్చే క‌సితో.. పోరాటం చేస్తే జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకోవ‌చ్చ‌ని నిరూపించారు. పట్టుదలతో కృషి చేస్తే తప్పకుండ నీదే విజయం అనే మాటలను నిజం చేశారు. జీవితంలో ఎదగాలనే కసి ఉంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటామని ఎందరో నిరూపించారు. ఆ జాబితాకు చెందిన వ్యక్తే ‘దిల్‌ఖుష్ సింగ్’. ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బీహార్ రాష్ట్రంలోని సహర్సా ప్రాంతంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన యువకుడు దిల్ ఖుష్ సింగ్. అతడు చదివింది ఇంటర్ కానీ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఎన్నో కష్టాలు పడిన అతను నేడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే అతడు ఈ స్థాయికి అంత ఆషామాషీగా రాలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. రిక్షా లాగించేవాడు, కుటుంబ పోషణ కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. అంతేకాక ఓ స్థిరమైన ఉద్యోగం కోసం ఒకసారి ప్యూన్ జాబ్ కోసం ఇంటర్వ్యూ వెళ్లాడు. అక్కడ యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో అక్కడ ఫ్యూన్ జాబ్ కూడా రాలేదని చెప్పుకొచ్చాడు.

ఇక దిల్ ఖుష్ సింగ్ రాడ్ బెజ్ అనే కంపెనీ ప్రారంభించి.. ఓలా, ఉబర్ తరహాలో బీహార్ లో క్యాబ్ లను ప్రారంభించాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ క్యాబ్ సంస్థళు కేవలం నగరాల్లో మాత్రమే తిరుగుతుంటాయి. కానీ దిల్ ఖుష్ సింగ్ ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ అందిస్తున్నాయి. రాడ్‌బెజ్ కంపెనీ, ట్రావెల్ కంపెనీలు, వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టైప్ అయి ఉంటుంది. అలా వారు చెప్పటిన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వీరికి కంపెనీకి ఆదరణ పెరిగింది.

ఇక ఆ తరువాత తాను ఇంక మంచి బిజినెస్ చేయాలని ఆలోచించాడు. ఆసమయంలో వచ్చిన ఐడియాతో ఆర్య గో క్యాబ్స్ గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారంభించి, కేవలం 6 నెలల్లో కోట్ల  రూపాయాల ఆదాయం పొందకలిగాడు. ప్రస్తుతం దిల్ ఖుష్ సింగ్ సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమేనని తెలిపారు. తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎలాంటి సమస్యలకు రాకుండా చూసుకోవడానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకున్నారు.

తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక్కొక్క డ్రైవర్ నెలకు రూ.55 వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తన ప్లాట్‌ఫామ్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నాని దిల్ ఖుష్ సింగ్ తెలిపారు. ఉద్యోగం రాలేదు, నా వ‌ల్ల కాదు అనే నిరుత్సాహంతో ఉండే చాలా మందికి యువతకు దిల్‌ఖుష్ సింగ్ సక్సెస్ స్టోరీ ఒక స్ఫూర్తిగా ఉంటుంది. మరి.. సింగ్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.