iDreamPost
android-app
ios-app

DGCA కొత్త నిబంధనలు.. ఫ్లైట్ ఛార్జీలు తగ్గనున్నాయా?

Flight Ticket Prices: ఇటీవల కాలంలో విమానాల ప్రయాణాలు బాగా పెరిగాయి. ఇక టికెట్  బుకింగ్, ఇతర సర్వీసుల విషయంలో పలు కీలక అంశాలు ఉంటాయి. తాజాగా వీటి విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Flight Ticket Prices: ఇటీవల కాలంలో విమానాల ప్రయాణాలు బాగా పెరిగాయి. ఇక టికెట్  బుకింగ్, ఇతర సర్వీసుల విషయంలో పలు కీలక అంశాలు ఉంటాయి. తాజాగా వీటి విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

DGCA కొత్త నిబంధనలు.. ఫ్లైట్ ఛార్జీలు తగ్గనున్నాయా?

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీజీఏ) అనేది పౌర విమానయాన రంగంలో నియంత్రణా సంస్థ, ఇది ప్రధానంగా భద్రతా సమస్యలతో వ్యవహరిస్తుంది. ఇది భారతదేశానిలోని వాయు రవాణా సేవల నియంత్రణకు, పౌర వాయు నిబంధనలు, వాయు భద్రత, విమానాల ప్రమాణాల అమలుకు బాధ్యత వహిస్తుంది. DGCA అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ)తో అన్ని నియంత్రణ విధులను కూడా సమన్వయం చేస్తుంది. తరచూ ఏవియేషన్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలానే తాజాగా విమాన టికెట్ల విషయంపై డీసీజీఏ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. మరి.. ఈ కొత్త నిబంధన ద్వారా ఫ్లైట్ టికెట్లు తగ్గుతాయా లేదా?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల కాలంలో విమానాల ప్రయాణాలు బాగా పెరిగాయి. ఇక టికెట్  బుకింగ్, ఇతర సర్వీసుల విషయంలో పలు కీలక అంశాలు ఉంటాయి. సాధారణంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల సర్వీసులను ఆ ధరలోనే కలిపేస్తారు. దీనివల్ల అవసరం లేని సర్వీస్ లకు సైతం ప్రయాణికులు చెల్లించక తప్పని పరిస్థితి. ఇది అనవసరమైన భారమని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. దీనికి పరిష్కారంగా తాజాగా డీజీసీఏ ఇటీవల ఓ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే డీజీసీఏ ఉత్తర్వూల్లో కీలక విషయాలను పేర్కొంది.

విమానయాన సంస్థలు జర్నీ ఛార్జీల్లో వారు అందించే కొన్ని సర్వీస్ లను కూడా కలిపిస్తేయని తెలిపింది. అలానే వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం.. చాలా సందర్భాంల్లో ఆయన సేవలు ప్రయాణికులకు అవసరమైన ఉండకపొచవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే వాటికి విడిగా రుసుము వసూలు చేసే విధానాన్ని తీసుకొస్తే మొత్తంగా ఛార్జీలో కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నామని డీజీసీఏ తెలిపింది. ఈనేపథ్యంలోనే ఆయా సేవలను టికెట్‌ లోని ప్రైమనరీ ధర నుంచి వేరు చేయాలని తెలిపింది. వాటిని ‘ఆప్ట్‌-ఇన్‌’ పద్ధతిన ఎంచుకునే అవకాశం ప్రయాణికులకు కల్పించాలని డీజీసీఏ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక ఆఫ్ట్-ఇన్, ఆఫ్ట్-ఔట్ అనే రెండు విధానాల్లో ప్రయాణికులు సేవలను వినియోగించుకోవచ్చు. ఆప్ట్‌-ఇన్‌ పద్ధతిలో టికెట్‌ ధరతో పాటు ఎంచుకున్న సేవలకు మాత్రమే ఛార్జీలు వేస్తారు. ఇంకా చెప్పాలంటే అవసరమైన సర్వీస్ లను ప్రయాణికులు విధిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ‘ఆప్ట్‌-ఔట్‌’ విధానం విషయానికి వస్తే.. కాస్త భిన్నంగా ఉంటుంది. ఆఫ్ట్-ఔట్ విధానంలో అన్ని సేవల ఛార్జీలు టికెట్‌ ధరలో ముందే కలిపేస్తారు.  వద్దనుకున్న సేవలను విధిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. డీజీసీఏ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం కొన్ని సేవలను టికెట్‌ ప్రైమరీ ధర నుంచి వేరు చేయాల్సి ఉంటుంది.

ప్రాధాన్య సీటు కేటాయింపు, భోజనం, ఎయిర్‌లైన్‌ లాంజ్‌ల వినియోగం, చెక్‌-ఇన్‌ బ్యాగేజ్‌, ఆట వస్తువులపై రుసుము, మ్యూజిక్ వస్తువులపై  ఛార్జీ, విలువైన బ్యాగేజ్‌గా ప్రత్యేక ధ్రువీకరణ ఛార్జీ వంటి వాటికి టికెట్ బేస్ ధర నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. డీజీసీఏ తాజా ప్రతిపాదనల నేపథ్యంలో విమాన సంస్థలు తమ టికెట్ల ధరల మదింపు విధానాన్ని స్వల్పంగా మార్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. ప్రయాణికులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా కావాల్సిన సేవలను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల భారీగా కాకపోయినా.. కొంతవరకు విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు..