iDreamPost
android-app
ios-app

ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ పై దాడి.. ఎందుకంటే!

  • Published Oct 07, 2023 | 3:57 PM Updated Updated Oct 07, 2023 | 3:57 PM
ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ పై దాడి.. ఎందుకంటే!

ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఓటర్లకు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. రైతులకు భరోసా ఇవ్వడం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెబుతుంటారు. గ్రామాలు, పట్టణాల అభివృద్దికి కృషి చేస్తామని ఎన్నో రకాల వరాల జల్లులలు కురిపిస్తుంటారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలు తుంగలో తొక్కేస్తారు. అలాంటి నాయకులు పర్యటనకు వస్తే ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేక నినాదాలు చేస్తుంటారు, చెప్పులు, గుడ్లు, టమాటాలతో దాడులు చేస్తుంటారు. ఇలాంటి చేదు అనుభవమే ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి జరిగింది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కారును, కాన్వాయ్‌ను అడ్డగించేందుకు కోపోద్రిక్తులైన రైతులు శనివారం ఉదయం ఉల్లిగడ్డలు, టమాటాలతో దాడి చేశారు. ఓఝార్ విమానాశ్రయం నుంచి అజిత్ పవార్ దిండోరికి వెళ్తున్న సమయంలో కొంతమంది రైతులు అక్కడికి చేరుకున్నారు. వీఐపీ కాన్వాయ్ కు నల్లజెండాలు చేత పట్టుకొని ఉల్లి పై ఎగుమతి సుంకాన్ని ఉపసంమరించుకోవాలని, టమాటా సాగు చేసేవారికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఉల్లిపాయలు, టమాటాలతో డిప్యూటీ సీఎం కాన్వాయ్ పై దాడి చేశారు.

ఇటీవల టమాటా ధర రూ.200 కు చేరిన చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో టైమాటా సాగు చేసే రైతులు కష్టాల్లో పడ్డారు. మార్కెట్ లో రిటైల్ ధర కిలో రూ.12-18 పలుకుతుంది. టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమకు సరైన న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కల్వాన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరసనకారులను అడ్డు తొలగించారు.