iDreamPost
android-app
ios-app

మహిళ ఇంట్లో సీక్రెట్ కెమెరా అమర్చిన స్టూడెంట్.. చివరికి ఏమైందంటే?

  • Published Feb 01, 2024 | 8:33 PM Updated Updated Feb 01, 2024 | 8:54 PM

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది దాని వల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. కొంతమంది స్పై కెమెరాలలో మహిళలను రహస్యంగా వీడియో, ఫోటోలు తీసి బెదిరిస్తున్నారు.. అలాంటి ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది దాని వల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. కొంతమంది స్పై కెమెరాలలో మహిళలను రహస్యంగా వీడియో, ఫోటోలు తీసి బెదిరిస్తున్నారు.. అలాంటి ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

  • Published Feb 01, 2024 | 8:33 PMUpdated Feb 01, 2024 | 8:54 PM
మహిళ ఇంట్లో సీక్రెట్ కెమెరా అమర్చిన స్టూడెంట్.. చివరికి ఏమైందంటే?

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు లాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న వయసు నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మహిళల ఒంటరిగా బయట నడవలేని పరిస్థితి అంటూ మహిళా సంఘాలు వాపోతున్నాయి. నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆడవారికి వేధింపులు మాత్రం తప్పడం లేదు. కామాంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నాయి. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి నేరాల సంఖ్య మరింత పెరిగిపోయిందని అంటున్నారు. ఓ ఇంట్లో రహస్య కెమెరా బయట పడటంతో దంపతులు షాక్ తిన్నారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ వైద్య విద్యార్థి చేసిన నిర్వాకం బయటపడింది. ఒక మహిళ తన భర్తలో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తుంది. గత నెల 30న ఆ మహిళ ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెన్ను లభించింది. ఆ పెన్ను లో రెడ్ లైట్ బ్లింక్ అవుతూ కనిపించడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త ఇంటికి వచ్చి పెన్నుమాదిరిగా ఉన్న పరికరాన్ని పరిశీలించాడు. దానికి రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించారు. అందులో రికార్డు అయిన క్లిప్పింగులను చూసి భార్యాభర్తలు షాక్ తిన్నారు. గత కొన్నిరోజుల నుంచి ఆ మహిళ బట్టలు మార్చుకోవడం సీక్రెట్ కెమెరా రికార్డు చేస్తున్నట్లు గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా.. సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆ ఇంటి యజమానికి కుమారుడైన ఇబ్రహీం, తరుచూ సదరు దంపతుల ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే రహస్య కెమెరా అమర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇబ్రహీం డెంటల్ స్టూడెంట్.. ఎంతో నమ్మకంగా తమ ఇంటికి వచ్చి ఇలాంటి దారుణంగా ప్రవర్తిస్తాడని ఊహించలేదని అంటున్నారు దంపతులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల. ఇలాంటి దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş