iDreamPost
android-app
ios-app

కర్ణాటకని వణికిస్తున్న డెంగ్యూ! పేషంట్స్ నిండిపోతున్న ఆస్పత్రిలు!

Dengue Cases: జూన్ నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల సీజన్ కావడంతో రక రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ క్రమంలోనే విష జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

Dengue Cases: జూన్ నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల సీజన్ కావడంతో రక రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ క్రమంలోనే విష జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

కర్ణాటకని వణికిస్తున్న డెంగ్యూ! పేషంట్స్ నిండిపోతున్న ఆస్పత్రిలు!

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో రక రకాల వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. దోమలు ద్వారా వ్యాప్తించే వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఆయా రాష్ట్రాల్లో మున్సిపల్ కార్పోరేషన్లు ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ సీజనల్ వ్యాధులు ప్రబలిపోతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పటికే ఆందోళనకరం స్థాయిలో 7 వేలకు పైగా  డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.  ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాల కారణంగా నీరు నిండి పరిసరాలు అపరిశుభ్రంగా తయారు కావడం.. దోమలకు నిలయంగా మారడం తెలిసిన విషయమే. సాధ్యమైనంత వరకు దోమల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు, అధికారులు సూచిస్తుంటారు. కర్ణాటకలో ప్రస్తుతం డెంగ్యూ విజృంభిస్తుంది. కర్ణాటకలో ప్రస్తుతం డెంగ్యూ కేసులు జులై 6 నాటికి 7,006 మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. డెంగ్యూ కారణంగా ఇప్పటికే ఆరుగురు చనిపోయినట్లు సమాచారం. రాష్ట్ర రాజధాని బెంగుళూరులోనే 1908 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని అధికారులు అంటున్నారు. ఇతర జిల్లాల వారీగా చూసుకుంటే చిక్కమగళూరులో 512, మైసూర్ లో 496, హవేరిలో 481 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలిన అధికారులకు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై ప్రతిపక్ష నేతల తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని.. అనారోగ్యంతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేత ఆర్ అశోక జయనగర్ లోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించి డెంగ్యూతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. రోడ్లపై చెత్తా చెదారాన్ని తొలగించాలని, దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న చోట్ల ఫాగింగ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి