iDreamPost
android-app
ios-app

Arvind Kejriwal: ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అయినా జైల్లోనే.. కారణమిదే

  • Published Jul 12, 2024 | 11:31 AM Updated Updated Jul 12, 2024 | 11:34 AM

Supreme Court, Interim Bail To Arvind Kejriwal: తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసినా.. జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఆ వివరాలు..

Supreme Court, Interim Bail To Arvind Kejriwal: తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసినా.. జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఆ వివరాలు..

  • Published Jul 12, 2024 | 11:31 AMUpdated Jul 12, 2024 | 11:34 AM
Arvind Kejriwal: ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అయినా జైల్లోనే.. కారణమిదే

దేశ రాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ మద్యం స్కామ్‌లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. ఈ కేసులో అరెస్ట్‌ అయ్యి తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు తాజాగా నేడు అనగా శుక్రవారం నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయినా కూడా ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ సీఎంగా కొనసాగాలా వద్దా అనే దానిపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ కేసులో.. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అంతేకాక ఈ కేసు విచారణనను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈడీ కేసులో తాత్కలిక బెయిల్‌ పొందినా సరే.. కేజ్రీవాల్‌ జైలులోనే ఉండనున్నారు. ఇందుకు కారణం ఆయన మీద నమోదైన సీబీఐ కేసు ఇంకా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉంది. సీబీఐ కేసు పెండింగ్‌లో ఉండటంతో.. ఈడీ కేసులో బెయిల్‌ వచ్చినా.. కేజ్రీవాల్‌ జైలులోనే ఉండనున్నారు. ఈనెల అనగా జూలై 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఆ తర్వాతే ఆయన బెయిల్‌పై బయటకు వస్తారా రారా అనే దానిపై స్పష్టత రానుంది.

తన అరెస్ట్ అక్రమంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ అరెస్ట్‌ విషయంలో పలు అంశాలు, సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అంతేకాదు, ప్రజలు కేజ్రీవాల్‌ను ఎన్నుకున్నారని, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలా.. వద్దా.. అనేది ఆయన ఇష్టమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, ఈ వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రూ.100 కోట్ల ముట్టాయనేది ఈడీ ప్రధాన ఆరోపణ. అంతేకాక ఈ మొత్తంలో కొంత భాగాన్ని కేజ్రీవాల్‌ తన స్వంతానికి వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. ఆ మొత్తంతో కేజ్రీవాల్‌ గోవాలోని విలాసవంతమైన హోటల్‌లో బస చేశౠరని ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న పీఎంఎల్‌ఏ కోర్టు.. జులై 12 కేజ్రీవాల్‌ను హాజరుపరచాలంటూ ప్రొడక్షన్‌ వారెంట్‌ను జారీ చేసింది.