15 వేలతో మీ స్కూటీని CNGగా మార్చుకోవచ్చు.. పెట్రోల్ భారం ఉండదు!

Convert Old Scooty To CNG For 15K: 15 వేలకే సీఎన్జీ స్కూటీనా? అవును 15 వేల రూపాయలతో మీరు మీ పాత స్కూటర్ ని లేదా స్కూటీని సీఎన్జీ వెహికల్ గా మార్చుకోవచ్చు. దీంతో మీకు పెట్రోల్ భారం అనేదే ఉండదు.

Convert Old Scooty To CNG For 15K: 15 వేలకే సీఎన్జీ స్కూటీనా? అవును 15 వేల రూపాయలతో మీరు మీ పాత స్కూటర్ ని లేదా స్కూటీని సీఎన్జీ వెహికల్ గా మార్చుకోవచ్చు. దీంతో మీకు పెట్రోల్ భారం అనేదే ఉండదు.

ప్రస్తుతం పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరలతో ఇంత హెవీ ట్రాఫిక్ లో వాహనాలు నడపాలంటే పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. గేదె కుడితి తాగినట్టు ఈ వాహనాలు పెట్రోల్ ని తెగ తాగేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు కొంతమంది. మరి కొంతమంది మాత్రం ఈవీ బ్యాటరీలు రిస్క్ అని భయపడిపోతున్నారు. అటువంటి సమయంలో బజాజ్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. సీఎన్జీ బైక్స్ ని తీసుకొస్తున్నట్లు చెప్పింది. దీంతో చాలా మంది ఖుషీ అయ్యారు. కానీ ఆల్రెడీ తమ వద్ద పాత బండ్లు ఉన్నప్పుడు కొత్త బైక్ కొనడం అంటే కష్టం కదా అని ఆలోచించేవారు కూడా ఉన్నారు. వారి కోసమే ఈ అవకాశం. 15 వేలతో మీ స్కూటీని సీఎన్జీ వాహనంగా మార్చుకోవచ్చు. ప్రముఖ కంపెనీ సీఎన్జీ కన్వర్షన్ కిట్లను తయారు చేస్తుంది.  

పెట్రోల్ తో పోలిస్తే సీఎన్జీ వాహనాలు ఎక్కువ మైలేజ్ నిస్తాయి. పైగా ధర కూడా పెట్రోల్ తో పోలిస్తే తక్కువ. ఫోర్ వీలర్స్ లో సీఎన్జీ వాహనాలు ఉన్నాయి కానీ టూవీలర్స్ లో మాత్రం ఇంకా రాలేదు. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్జీ బైక్ ని తీసుకొస్తుంది బజాజ్ కంపెనీ. దీంతో ఈ సీఎన్జీ బైక్ ఎప్పుడొస్తుందా అని చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. జూలై 5న ఈ బైక్ లాంఛ్ కానుంది. అయితే ఆల్రెడీ మీ దగ్గర పాత స్కూటీ ఉంటే కనుక దాన్ని మీరు సీఎన్జీ వాహనంగా మార్చుకోవచ్చు. ఇప్పటికే పలు కంపెనీలు ద్విచక్ర వాహనాలను సీఎన్జీ వెహికల్స్ గా మార్చే పనిని ప్రారంభించాయి. పెట్రోల్ బైక్స్, స్కూటీలను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చుకునే కిట్స్ ని తెచ్చినట్టు.. తాజాగా ఓ కంపెనీ పెట్రోల్ నుంచి సీఎన్జీ కన్వర్షన్ కిట్లను తయారు చేసే పనిలో పడింది.

ఢిల్లీలో లొవాటో అనే కంపెనీ సీఎన్జీ కిట్లను తయారు చేస్తుంది. ఈ కిట్ కి 15 వేల రూపాయల ఖర్చు అవుతుందని.. ఈ ఖర్చును ఏడాది కంటే తక్కువ సమయంలోనే రికవరీ చేసుకోగలుగుతారని కంపెనీ పేర్కొంది. స్కూటీల్లో బూట్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఇందులో కిట్ ని ఏర్పాటు చేయవచ్చునని కంపెనీ తెలిపింది. బైక్స్ లో కిట్ ని పెట్టడానికి ప్లేస్ లేదని.. స్కూటీలు, స్కూటర్స్ లో మాత్రమే వీలవుతుందని వెల్లడించింది. అయితే ఈ కిట్ ని అమర్చుకున్నంత మాత్రాన కేవలం సీఎన్జీతోనే నడుస్తుందనుకుంటే పొరపాటే. ఒకవేళ సీఎన్జీతో నడవకపోతే.. పెట్రోల్ తో కూడా నడపచ్చు. దీని కోసం లొవాటో కంపెనీ ఒక స్విచ్ ని ఏర్పాటు చేసింది. ఈ స్విచ్ ద్వారా పెట్రోల్ కావాలంటే పెట్రోల్ కి, సీఎన్జీ మోడ్ కావాలంటే సీఎన్జీలోకి కన్వర్ట్ అవ్వచ్చు. సీఎన్జీ కిట్ లో రెండు సిలిండర్లని స్కూటర్ ముందు భాగంలో అమర్చుతుంది. వాటిని కవర్ తో కప్పుతారు. సిలిండర్లకు సంబంధించిన యంత్రం సీటు కింద బూట్ స్పేస్ లో సరిపోతుంది.  15 వేలకే సీఎన్జీ కన్వర్షన్ కిట్ కొనుక్కుంటే అసలు పెట్రోల్ భారమే ఉండదు.   

Show comments