Arjun Suravaram
Frog Found in Chips: చాలా మంది చిప్స్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులతో గొడవపడి మరీ..వాటిని కొనిచ్చుకుంటారు. అయితే తాజాగా జరిగిన ఓఘటన చూస్తే..వాటిని తిన్నాలంటేనే భయపడతారు.
Frog Found in Chips: చాలా మంది చిప్స్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులతో గొడవపడి మరీ..వాటిని కొనిచ్చుకుంటారు. అయితే తాజాగా జరిగిన ఓఘటన చూస్తే..వాటిని తిన్నాలంటేనే భయపడతారు.
Arjun Suravaram
నేటికాలం బయట దొరికే ఏ ఆహార పదార్థం తిన్నాలన్న ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం.. ఇటీవల కాలంలో ఆహార పదార్థాల విషయంలో అనేక ఘోరమైన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు వ్యాపారస్తులు తమ స్వార్థం కోసం నాణ్యతలేకుండా ఫుడ్ ను తయారు చేస్తున్నారు. దీంతో ఔట్ సైడ్ ఫుడ్ ను ముట్టుకునేందుకే జనాలు బయపడి పోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఐస్ క్రీమ్ లో పురుగులు, బిర్యానీలో కుళ్లిపోయిన చికెన్ వచ్చిన సంఘనలు మనకు తెలిసిందే. ఇలా తరచూ ఏదో ఒక ఫుడ్ విషయంలో విస్తుపోయే దృశ్యాలు వస్తున్నాయి. తాజాగా చిప్స్ లో కుళ్లిపోయిన కప్ప కనిపించింది. మరి.. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
చాలా మంది చిప్స్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చిన్నపిల్లలు అయితే వాటి కోసం తల్లిదండ్రుల వద్ద మారం చేస్తుంటారు. ఇక అనేక రకాల చిప్స్ ప్యాకెట్లు మార్కెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనతో చిప్స్ తిన్నాలి అనుకునేవారు గట్టి షాక్ తగిలింది. తాజాగా జరిగిన ఈ సంఘటన వింటే నిజంగా మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. చిప్స్ ప్యాకెట్ లో కప్ప కళేబరం ప్రత్యక్షమైంది. అది కూడా కుళ్లిపోయిన స్థితిలో ఆ కప్ప కళేబేరం ఉంది. గుజరాత్ లోని జామ్ నగర్ ప్రాంతంలోని ఓ షాపులో ఆలు చిప్స్ ప్యాకెట్ లో చనిపోయిన కప్ప ప్రత్యక్షమైంది. అయితే చిప్స్ తినేందుకు ఎంతో ఆశగా కొనుగోలు చేసిన వినియోదారుడు..ఆ సన్నివేశం చూసి షాకయ్యాడు.
వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సదరు కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఇష్యుపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు ఓ సంస్థ తయారు చేసిన ఈ చిప్స్ ప్యాకెట్ లో కుళ్లిపోయిన కప్ప కళేబరం ఉందని అధికారులు గుర్తించారు. అదే విధంగా కొన్ని రోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. భోజనంలో మెటల్ బ్లేడ్ కనిపించింది. బెంగళూరు నుంచి అమెరికా వెళ్తున్న విమానంలో ప్రయాణం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన చిప్స్ ఘటనను కస్టమర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
A dead frog in a packet of Balaji Aalu chips
Gujarat – In a shop in Jam Nagar, a customer took a packet of alu chips made by Balaji Wafers and opened it and found a dead frog in it. Civil Supplies Department ordered an investigation based on the customer’s complaint. pic.twitter.com/ZFaJjpVlpZ— Hashim Mirza@Journalist (@HashimMirz82582) June 19, 2024