David Warner, Michaung Cyclone: ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెన్నై వరదలపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. నెటిజన్లు వార్నర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
David Warner, Michaung Cyclone: ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెన్నై వరదలపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. నెటిజన్లు వార్నర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మిచౌంగ్ తుఫాన్.. ప్రస్తుతం దక్షిణ భారతాన్ని వణికిస్తున్న పేరు. మరీ ముఖ్యంగా తమిళనాడు ఈ తుఫాన్ ధాటికి కాకావికలం అవుతోంది. వరదలు ఇళ్లను ముంచెత్తడంతో.. ప్రజలందరూ అష్టకష్టాలు పడుతున్నారు. అపార్ట్ మెంట్స్ ల్లోకి సైతం నీరు రావడంతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు జలమయం అయ్యాయి. ఇక ఈ విపత్తుపై సెలబ్రిటీలు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరోలు సూర్య, కార్తీలు తక్షణ సాయం కింద రూ. 10 లక్షలు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెన్నై వరదలపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
డేవిడ్ వార్నర్.. పేరుకే ఆస్ట్రేలియా ప్లేయర్. కానీ ఎంతో మంది భారతీయుల మనసులను కొల్లగొట్టాడు. డేవిడ్ భాయ్ కు ఇండియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్నర్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహించడం. రెండు టాలీవుడ్ సినిమా పాటలను, డైలాగ్స్ ను తనదైన రీతిలో డబ్ స్మాష్ చేయడం. ఈ రెండు రీజన్స్ తో భారతీయులకు దగ్గరైయ్యాడు డేవిడ్ భాయ్. దీంతో ఇండియాలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందిస్తూ ఉంటాడు.
తాజాగా మిచౌంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా చెన్నై నగరం వరదల్లో మునిగిపోయింది. వర్షపు నీరు రోడ్లను, ఇళ్లను ముంచెత్తడంతో.. జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ వరదలపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు డేవిడ్ వార్నర్. “చెన్నైలో సంభవిస్తున్న వరదలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. ఈ వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నా ఆలోచనలు మెుత్తం వారి చుట్టే తిరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు సేఫ్ గా, జాగ్రత్తగా ఉండాలిన కోరుకుంటున్నాను. ఇక మీరు సాయం చేసే స్థితిలో ఉంటే అక్కడి వారికి కచ్చితంగా సాయం చేయండి. రక్షణ చర్యలకు మీ చేయిని కూడా అందించండి. అందరూ కలిసికట్టుగా ముందుకు కదిలిరండీ” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.
కాగా.. చెన్నై వరదలపై వార్నర్ స్పందించిన తీరు ప్రతీ ఒక్కరిని కదిలించింది. వార్నర్ భాయ్ మీరు నిజంగా గొప్ప వ్యక్తి అని మరోసారి రుజువుచేసుకున్నారు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పటికే చెన్నై వరదల నుంచి ప్రజలను క్షేమంగా కాపాడాలని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు ఆడిన ఓ శ్రీలంక ప్లేయర్ దేవుడిని ప్రార్థించిన విషయం తెలిసిందే. మరి వరదలపై స్పందించిన డేవిడ్ వార్నర్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.