iDreamPost

ఎన్నికల ఫలితాల కోసం ఆ పని చేస్తున్నారా? అయితే మీ అకౌంట్ ఖాళీ..

Election Results 2024: దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్ రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఫలితాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ పని చేస్తే.. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది.

Election Results 2024: దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్ రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఫలితాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ పని చేస్తే.. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది.

ఎన్నికల ఫలితాల కోసం ఆ పని చేస్తున్నారా? అయితే మీ అకౌంట్ ఖాళీ..

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు జూన్ 1వ తేదీతో ముగిశాయి. దీంతో దాదాపు నెలన్నర రోజులు పాటు సాగిన ఎన్నికల సంబరాలు శనివారం ముగిశాయి. ఇక అందరి దృష్టి రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై ఉంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ రాష్ట్ర శాసన సభ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇక ఎలక్షన్ రిజల్ట్ ను తెలుసుకునేందుకు జనం అనేక సైట్లను ఫాలో అవుతున్నారు. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వేళ ప్రజలు ఆ చిన్న తప్పు చేస్తే.. బ్యాంకు అకౌంట్లు మొత్తం ఖాళీ అవుతాయి. మరి.. ఆ పని ఏమిటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా  మోసాలు జరుగుతూనే ఉన్నాయి.  అలానే పరిస్థితులకు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు తమ రూట్లను మార్చుకుని కొత్త కొత్త పద్ధతుల్లో సామాన్య జనాలను మోసం చేస్తున్నారు. అలానే జనం ఎక్కువ సెర్చ్ చేస్తున్న అంశంకు సంబంధించి ఫేక్ లింక్ పంపిస్తూ.. సైబర్ నేరాలు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనల్లో నిరక్ష్యరాసుల నుంచి విద్యావంతుల వరకు అందరూ  చాలా మంది మోస పోతున్నారు. అలానే తాజాగా  ఎన్నికల కౌంటింగ్ వేళ మరో భారీ మోసానికి కేటుగాళ్లు సిద్ధమైనట్లు సమాచారం.

రేపు దేశ వ్యాప్తంగా విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుక జనం ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో పలు ఇంటర్ నెట్ సైటలు ఎన్నికల రిజల్ట్ కోసం వివిధ పీడీఎఫ్ లేదా లింక్స్ ను పంపిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో చాలా వరకు ఫేక్ ఉంటాయి. ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాలనే ఆతృతలో పొరపాటున ఆ లింక్స్ ఓపెన్ చేస్తే..ఇంక అంతే సంగతులు. సైబర్ కేటుగాళ్లు ఎలక్షన్ రిజల్ట్ వేళ..జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు ఇలాంటి ఫేక్స్ లింక్స్ ను పంపిస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ అని పీడీఎఫ్ లు/ లింక్స్ వస్తున్నాయ్ దయచేసి ఎవరు ఓపెన్ చేయకండని నిపుణులు చెబుతున్నారు. పొరపాటు ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీ బ్యాంకు అకౌంట్ డిటైల్స్ సైబర్ నేరగాళ్లు కీ  వెళ్తున్నాయని, దయచేసి ఎవరు ఓపెన్ చేయకండని సైబర్ నిపుణలు చెబుతున్నారు. మొత్తంగా రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆ పని చేస్తే మీ అకౌంట్ ఖాళీ అని నిపుణులు చెబుతున్నారు.

ఇది ఇలాంటి దేశ వ్యాప్తంగా ప్రజలు ఏపీ రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో ఎవరు గెలుస్తారు అనే దానికంటే ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపైనే దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్ సీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని అంచానా వేశాయి.  175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికల జరిగాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి