iDreamPost
android-app
ios-app

అయోధ్య రామునికి రూ. 11 కోట్ల విలువైన కిరీట.. దాత ఇతనే

ఎన్నో శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది అయోధ్యలోని రామాలయం. శ్రీరాముడు చిన్ని రామునిగా కొలువై ఉండగా.. భక్తులు సందర్శించుకుంటున్నారు. నేటి నుండి సామాన్యులు సైతం దర్శించుకునే భాగ్యం కల్పించారు నిర్వాహకులు.

ఎన్నో శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది అయోధ్యలోని రామాలయం. శ్రీరాముడు చిన్ని రామునిగా కొలువై ఉండగా.. భక్తులు సందర్శించుకుంటున్నారు. నేటి నుండి సామాన్యులు సైతం దర్శించుకునే భాగ్యం కల్పించారు నిర్వాహకులు.

అయోధ్య రామునికి రూ. 11 కోట్ల విలువైన కిరీట.. దాత ఇతనే

ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ జనవరి 22తో తీరిపోయింది. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి కొలువై ఉండటంతో హిందూ భక్తుల కలల సాకారమైనట్లు అయ్యింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట వేడుక కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. శ్రీరామ్ లల్లా విగ్రహాన్ని చూసి ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగితేలిపోయారు. జీవకళ ఉట్టిపడేలా ఉన్న నిండైన విగ్రహాన్ని చూసి తరించిపోయారు భక్తులు. 51 అడుగుల ప్రతిమను చూసి.. ఆ రాముడు మళ్లీ తిరిగి వచ్చాడని సంబరపడిపోతున్నారు. నగుమోముతో.. చిరు మందహాసపు రూపంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు బాల రాముడు.

రాముడికి ధరించిన ఆభరణాలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో చర్చకు దారి తీశాయి. నీల మేఘ శ్యాముడి నిండైన రూపానికి ఈ ఆభరణాలు మరింత అందాన్ని తెచ్చాయి. వాటిల్లో ఒకటి బంగారు,  వజ్రాల కిరీటం. శ్రీరాముని ధరింప చేసిన ఆ కిరీటం.. ఆ విగ్రహానికి మరింత వన్నె తెచ్చింది. ఇంతకు ఈ కిరీటాన్ని అందించింది ఎవరంటే.. ముఖేష్ పటేల్. గుజరాత్‪లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి రాములోరికి ఈ భారీ విరాళాన్ని అందించారు. ముఖేష్ అక్కడ ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ని నిర్వహిస్తున్నాడు.ఈ కిరీటం ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. 11 కోట్లు. నాలుగు కిలోల బంగారం, వజ్రాలు, కెంపులు, జెమ్ స్టోన్స్, ముత్యాలు, నీలమణి వంటివి వినియోగించి.. తయారు చేయించారు.

Ram got Rs. 11 crore crown

శ్రీరాముని ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా.. తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి, ఈ కిరీటాన్ని అందించారు. అయోధ్యలో రాముడు తలపై ధరించిన కిరీటం ఇదే. కేవలం కిరీటం రూపంలో మాత్రమే కాదూ.. తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్ల వంటి రూపాల్లో రామమందిరానికి భారీగా బంగారం విరాళం అందింది. అందులో 101 కేజీల బంగారం అందిందట దిలీప్ కుమార్ కుటుంబం నుండి. దిలీప్ కుమార్ కూడా సూరత్ వజ్రాల వ్యాపారే. రాముని మీద భక్తితో భారీ విరాళం అందించారు. వీటి మొత్తం విలువ రూ. 68 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు రామ మంది ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.