Venkateswarlu
Venkateswarlu
ఓ వైపు భారీ వర్షాలు.. మరో వైపు భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులతో రాజస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఈ నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బ అంటూ మరో ప్రమాదం వచ్చి పడింది. వర్షాల కారణంగా నదుల్లోంచి పెద్ద సంఖ్యలో మొసళ్లు జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు ఓ మొసలి రాత్రి పూట రోడ్డు దాటుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన రాజస్తాన్‌లోని కోటలో వెలుగు చూసింది.
ఓ మూడున్నర అడుగుల ఓ మొసలి రోడ్డు దాటుతూ ఉంది. రోడ్డుపై వెళుతున్న వాహనాలు ఆ మొసలిని చూసి ఆగిపోయాయి. చుట్టు పక్కలి జనం కూడా దాన్ని చూసి భయంతో ఆగిపోయారు. అది మొల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందున్న కాల్వలోకి దిగింది. ఇక, ఈ వీడియోను మంగళవారం రాత్రి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ వర్షాలు, భూకంపాలతోటి చస్తుంటే.. ఇప్పుడు మొసళ్లు కూడానా’’.. ‘‘ కొంచెం ఏమర పాటుగా ఉన్నా ఆ మొసలి చేతిలో ప్రాణాలు పోతాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున జైపూర్ ప్రజలను భూకంపం భయపెట్టింది. మూడు సార్లు భూమి కంపించింది. దీంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మొదటి భూకంపం తెల్లవారుజామున 4:09 నిమిషాలకు ..రెండో భూకంపం 4:22 కి.. చివరిది 4. 25 నిమిషాలకు వచ్చింది. ఈ భూకంపం కారణంగా ప్రజలెవ్వరికీ ఎలాంటి నష్టం కలగలేదు. మరి, రాజస్తాన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వరుస పకృతి విపత్తులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Scary…
Crocodile crossing the road in Kota, Rajasthan. Effects of Monsoon rains😊 pic.twitter.com/m2dwjXZFYq— Susanta Nanda (@susantananda3) July 19, 2023