iDreamPost
android-app
ios-app

ఇద్దరితో ప్రేమ.. ఒకరితో ఇల్లీగల్ కాంటాక్ట్.. ప్రియుడితో కలిసి..

  • Published Feb 07, 2024 | 1:01 PM Updated Updated Feb 07, 2024 | 1:01 PM

ఆమె మామూలు అమ్మాయి కాదు. బేబి మూవీని తలపించింది. బేబి మూవీ స్టోరీ వేరే. ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిపి.. చివరకు మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది మన హీరోయిన్. కానీ ఈమె కాస్త డిఫరెంట్. ఇంతకు ఏం చేసిందంటే..?

ఆమె మామూలు అమ్మాయి కాదు. బేబి మూవీని తలపించింది. బేబి మూవీ స్టోరీ వేరే. ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిపి.. చివరకు మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది మన హీరోయిన్. కానీ ఈమె కాస్త డిఫరెంట్. ఇంతకు ఏం చేసిందంటే..?

  • Published Feb 07, 2024 | 1:01 PMUpdated Feb 07, 2024 | 1:01 PM
ఇద్దరితో ప్రేమ.. ఒకరితో ఇల్లీగల్ కాంటాక్ట్.. ప్రియుడితో కలిసి..

నేటి కాలంలో కొంత మంది అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. సోషల్ మీడియా వినియోగించడంలోనే కాదూ..ఇతర వ్యవహారాల్లో కూడా. జల్సాలు, డబ్బుల కోసం అబ్బాయిలను ఎర వేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్ లేదా లవర్స్‌ను మెయిన్ టైన్ చేస్తూ వారిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ది రియల్ బేబీస్‌లా తయారయ్యారు. ఒక లవర్ గురించి మరొక బాయ్ ఫ్రెండ్‌కు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ట్రయంగిల్ లవ్ స్టోరీలో బకరాలుగా మారిపోతున్నారు అబ్బాయిలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి మాత్రం నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. ఇద్దరితో ప్రేమ ఆటలు ఆడిన అమ్మాయి.. ఒక ప్రియుడితో కలిసి.. మరొక లవర్‌ను హతమార్చింది.

ఈ ఘటన అసోం రాజధాని గౌహతిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కలకత్తాకు చెందిన అంజలి షా, వికాశ్ కుమార్ షా లవర్స్. అంజలి ఓ రెస్టారెంట్‌లో పని చేస్తోంది. ఆమెకు ఏడాది క్రితం పూణెకు చెందిన సందీప్ కాంబ్లీ అనే కార్ల డీలరుతో పరిచయం ఏర్పడి.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తనకు లవర్ ఉన్నాడని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవాలంటూ అంజలిని ఇబ్బందికి గురి చేశాడు కాంబ్లీ. ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి.. ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక జరిగిన విషయాన్ని లవర్ వికాశ్‌కు చెప్పింది. ఎలాగైనా అతడిని అంతమొందించాలని భావించారు వికాశ్, అంజలి.

పథకంలో భాగంగా కాంబ్లీకి ఫోన్ చేసి కలకత్తా రావాలని కోరింది. అక్కడికి రావడం కుదరదని, గౌహతికి రావాలంటూ.. అక్కడే ఓ ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేశాడు. వికాశ్, అంజలి.. 500 కిమీ దూరంలో ఉన్న గౌహతికి ఫ్లైట్‌లో వెళ్లారు. వికాశ్ అక్కడికి వెళ్లాక వేరొక గది తీసుకున్నాడు. అంజలి, కాంబ్లీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వికాశ్ గదిలోకి వెళ్లి.. కాంబ్లీపై దాడి చేసి చంపేశారు. అనంతరం అతడి ఫోన్ తీసుకుని పరారయ్యారు లవర్స్. కొద్ది సేపటి తర్వాత హోటల్ సిబ్బంది వెళ్లి చూసే సరికి, కాంబ్లీ రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ, ఫ్లైట్ ప్రయాణికుల జాబితాను పరిశీలించి నిందితులను గుర్తించారు ఖాకీలు. ఇంకా సేపటిలో వారిద్దరూ కలకత్తాకు వెళ్లే ఫ్లైట్ లో వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతుండగా.. ఓ హోటల్లో వారిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet