వీడియో: స్మశానవాటిక గోడ కూలి ఐదుగురు దుర్మరణం..!

Crematorium Wall Collapsed: వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరు.ఈ మధ్య కాలంలో మృత్యువు ఎప్పుడు ఎలా కబలిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

Crematorium Wall Collapsed: వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరు.ఈ మధ్య కాలంలో మృత్యువు ఎప్పుడు ఎలా కబలిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్నా.. ఒక్క క్షణంలోనే విషాద ఛాయలు అలుముకుంటాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవాల్లు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వారి కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోతున్నారు. స్మశాన వాటిక గోడ ఒక్కసారే కుప్పకూలి పోయింది. ఈ దుర్గటనలో చిన్నారి సహా ఐదురుగురు చనిపోయిన ఘటన తీవ్ర కలకం రేపింది. ఈ సంఘటన హర్యానాలోని గురు గ్రామ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని గురుగ్రామ్ అర్జున్ నగర్ ప్రాంతంలో ఒక స్మశాన వాటిక గోడను అంటుకొని కొంతమంది కుర్చీలు వేసుకొని మాట్లాడుతున్నారు. హఠాత్తుగా స్మశాన వాటిక గోడ కుప్పకూలిపోయి వారిపై పడింది. ఈ ఘటన అంతా చూస్తుండగానే జరిగిపోయింది. గోడ శిథిలాల కింద ఒక చిన్నారితో సహా నలుగురు సమాధి అయ్యారు. గోడ కూలే సమయానికి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మీదపడిపోయింది. ఈ ఘటనలో పక్కన ఉన్నవారు పరుగు పెట్టి తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు.  శ్మశాన వాటిక గోడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. చికిత్స కోసం గురుగ్రామ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ దుర్గటనలో దేవి దయాల్, మనోజ్ గబా, క్రిష్ణ, తాన్య, కుష్బు మరణించారు.  ఈ గోడ 18 అడుగుల ఎత్తులో ఉంది. గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.  ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. మృతులంగా స్మశాన వాటి పక్కన ఉండే వారే అని పోలీసులు తెలిపారు. పాత గోడను సకాలంలో పునరుద్దరించకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు స్మశాన వాటిక కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

Show comments