iDreamPost
android-app
ios-app

వీడియో: ఇదేందయ్యా ఇది.. కూల్ డ్రింక్ ఇలా కూడా తాగుతారా?

  • Published Jan 05, 2024 | 3:00 PM Updated Updated Jan 05, 2024 | 3:00 PM

Couples Thumbs Up Drink in Shoes: ఇటీవల ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఎన్నో రకాల వీడియలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రీల్స్ చేస్తూ.. పాపులారిటీ సంపాదించాలని కొంతమంది చేస్తున్న పిచ్చిపనులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Couples Thumbs Up Drink in Shoes: ఇటీవల ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఎన్నో రకాల వీడియలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రీల్స్ చేస్తూ.. పాపులారిటీ సంపాదించాలని కొంతమంది చేస్తున్న పిచ్చిపనులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

  • Published Jan 05, 2024 | 3:00 PMUpdated Jan 05, 2024 | 3:00 PM
వీడియో: ఇదేందయ్యా ఇది.. కూల్ డ్రింక్ ఇలా కూడా తాగుతారా?

మెట్రోట్రైన్ సేవలు మొదలైనప్పటి నుంచి ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం అవుతుంది. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద నగరాల్లో మెట్రో సేవలు విస్తరిస్తున్నాయి. మెట్రో ప్రాజెక్ట్ వల్ల ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడవొచ్చు. ఇందులో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. కాస్త ధర ఎక్కువే అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా జర్ని చేయవొచ్చు. అంతా బాగానే ఉన్నా.. ఈ మద్య మెట్రో ట్రైన్ లో జరుగుతున్న చిత్ర విచిత్రమైన సంఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొంతమంది దిక్కుమాలిన రీల్స్ చేయడం వల్ల ఇతరులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ జంట థమ్స్ అప్ బాటిల్ తో డ్రింక్ చాలా విచిత్రంగా తాగారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఢిల్లీ మెట్రో రైల్ లో ఎన్నో రకాల వింతలు, విడ్డూరాలు, అసహ్యకరమైన పనులు జరుగుతున్నాయి. సీట్ కోసం లేడీస్ కొట్టుకోవడం కామన్ అయ్యింది. సెక్యూరిటీ ఎన్నిరకాలుగా వారించినా.. పాపులారిటీ కోసం పిచ్చి చేష్టలు చేస్తున్నారు. పబ్లిక్ చూస్తున్నారన్న జ్ఞానం లేకుండా హగ్గులు, ముద్దుల్లో మునిగిపోతున్నారు. కొంతమంది డ్యాన్స్, సినిమా డైలాగ్స్ చెబుతూ రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ జంట మెట్రోలో ప్రయాణిస్తూ థమ్స్ అప్ బాటిల్ పట్టుకొని కూల్ డ్రింక్ తాగారు. దీంట్లో పెద్ద వెరైటీ ఏముందని అనుకుంటున్నారా? ఆ డ్రింక్ షూలో వేసుకొని పెద్ద స్ట్రా ద్వారా ముందుగా యువకుడు సేవించాడు. ఆ తర్వాత యువతి సేవించింది. ఇది చూసి ట్రైన్ లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇదేందిరా అయ్యా.. కూల్ డ్రింక్ ఇలా కూడా తాగుతారా..? అంటూ నవ్వుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ముందుగా బాయ్ ఫ్రెండ్ తన కాలుకు ఉన్న రెండు షూస్ లో ఒకదాన్ని చేతిలో పట్టుకున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ థమ్స్ అప్ బాటిల్ తో కొంచెం డ్రింక్ షూ లో పోసింది. అయితే వారు ధరించిన షూ లోపల ఎదైనా కప్ ఉంచారా? లేదా అనేది మాత్రం చూపించలేదు. కాకపోతే రికార్డు అయిన వీడియోలో ఇద్దరు కూల్ డ్రింక్ స్ట్రా తో తాగుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో కోక్ టిన్ లో అబ్బాయి, అమ్మయి ఒకరి నోట్లో ఒకరు ఉమ్ముకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా షూలో కూల్ డ్రింక్ పోసుకొని తాగడం అనేది పిచ్చికి పరాకాష్ట అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet