iDreamPost
android-app
ios-app

వేసవిలో మీ ఇంటిని చల్లగా ఉంచే మొక్కలివే.. ఇవి ఉంటే AC అవసరంలేదు!

ప్రస్తుతం వేసవి ఎండలు అదరగొడుతున్నాయి. జనాలు బయటకు వచ్చేందుకు అల్లాడిపోతున్నారు. ఇక వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని రకాల మొక్కలు నాటితే ఏసీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం వేసవి ఎండలు అదరగొడుతున్నాయి. జనాలు బయటకు వచ్చేందుకు అల్లాడిపోతున్నారు. ఇక వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని రకాల మొక్కలు నాటితే ఏసీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో మీ ఇంటిని చల్లగా ఉంచే మొక్కలివే.. ఇవి ఉంటే AC అవసరంలేదు!

ప్రస్తుతం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇళ్లలో ఉండే వారు ఉక్కబోతలతో ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు వేసవి సెగల నుంచి తప్పించుకునేందుకు ఏసీలు, కూలర్లు వినియోగిస్తుంటారు. వీటి ద్వారా చాలా వరకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే అందరికి వీటిని కొన్నే స్థోమత, వినియోగించే పరిస్థితి ఉండకపోవచ్చు. అలానే మరికొందరికి అలర్జీ సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి వారందరూ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ, చల్లదానాన్ని ఆస్వాదించాలంటే ఇళ్లలో కూలింగ్ ఇచ్చే మొక్కలు పెంచుకుంటే మేలని నిపుణలు చెబుతున్నారు. ఆ కూలింగ్ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే ఇక ఏసీ అవసరం లేదని అంటున్నారు. మరి.. ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వేసవి కాలం అనగానే అందరికి చల్లదానం కోసం చూస్తుంటారు. ఇక భానుడి తాపానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరు భయంతో వణికి పోతున్నారు. ఇక చల్లదనం కోసం అనేక ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు. చాలా మంది ఏసీలు, కూలర్లు, ఫ్యానులు వాడుతున్నారు. అయితే అవి కొనలేని వారు అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోవాలంటే, చల్లదనాన్ని ఆస్వాదించాలంటే ఇళ్లలో కొన్నిరకాల కూలింగ్ ప్లాంట్స్ పెంచుకోవడం  మంచిది.

కూలింగ్ ఇచ్చే మొక్కల్లో ఫికస్ మొక్క ఒకటి. సాధారణంగానే మొక్కలు, చెట్లు సహజంగానే చల్లదనాన్ని ఇస్తాయి. వాతావరణాన్ని చల్లగా మార్చడంలో ఈ ఫికస్ మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలను ఇంటి ఆవరణలో మట్టి కుండీలల్లో పెంచడం ద్వారా వేడి గాలిని శుద్ధిచేసి కూలింగ్ ఇస్తాయంట.

అలానే బేబీ రబ్బర్ ప్లాంట్ చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే ఈ బేబీ రబ్బర్ ప్లాంట్ ఇంటిలో పెంచడానికి చాలా అనువైనది. ఇంటి పరిసరాల్లోని వాతావరణాన్ని చల్లబరచడంలో ఈ మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంటి వాతావరణాన్ని మిగతా ప్రదేశాలతో పోల్చితే చల్లగా మారుస్తాయి.

ఇక చల్లదనాన్న ఇచ్చే మొక్కల్లో మరోకటి ఫెర్న్ ప్లాంట్. ఇది కూలింగ్ ఇచ్చే ప్లాంట్ గా దీనికి మంచి గుర్తింపు ఉంది. ఇళ్లల్లో ఫెర్న్ మొక్కను పెంచుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం కలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొక్క గాలిలో తేమను పీల్చి తనలో స్టోర్ చేసుకునే గుణం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఆ తేమను విడుదల చేస్తుంది.  ఇక ఈ మొక్కలో ఎటువంటి పువ్వులు, కాయలు ఉండవు. కేవలం ఆకులతో ఉండటం కారణంగా ఈ మొక్క చల్లదనాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు కలబంద మొక్క కూడా చల్లదనాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. మరి.. ఇలాంటి మొక్కలు ఇళ్లలో ఉంటే కూలింగ్ విషయంలో ఏసీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.