iDreamPost
android-app
ios-app

బెంగళూరులో మరోసారి పేలుడు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు!

  • Published Aug 14, 2024 | 8:59 PM Updated Updated Aug 14, 2024 | 8:59 PM

Bengaluru: దేశ వ్యాప్తంగా రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అంతా సిద్దమవుతుంది. కీలక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగుళూరులో పేలుడు కలకలం సృష్టించింది.

Bengaluru: దేశ వ్యాప్తంగా రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అంతా సిద్దమవుతుంది. కీలక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగుళూరులో పేలుడు కలకలం సృష్టించింది.

బెంగళూరులో మరోసారి పేలుడు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు!

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పదివేల మంది పోటీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దేశంలోని ముఖ్యనగరాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. వీఐపీల నివాసాల, పార్కులు, రైల్వే, బస్సు స్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజాగా బెంగుళూరులో పేలుడు కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకల సందర్భంగా బెంగుళూరులో పేలుడు సంఘటన ఒక్కసారే ఉలిక్కిపడేలా చేసింది. ఆ మధ్య బెంగుళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన ఉగ్రమూకల ఉనికి బయటపడింది. ఈ కేసులో పలువురు ఉగ్రవాదులపు ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. తాజాగా బెంగుళూర్ లో కుక్కర్ పేలుడు ఘటన పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని స్థానిక పోలీసులు తోసిపుచ్చినప్పటికీ మరోసారి విచారించేందుకు నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సంఘటన స్థలం చేరుకుంది.

బెంగుళూరు జేపీ నగర్ లోని ఉడిపి టిఫిన్ సెంటర్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ ఉత్తర్ ప్రదేశ్ కి చెందినవారుగా తేలింది. పేలుడు ఘటనలో ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుయ్యాయి. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని, పేలుడు పదార్ధాలు వినియోగించినట్లు ఏక్కడ లేదని ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడు అని, గాయపడిన వారు ఇద్దరూ బార్బర్ వృత్తి చేస్తుంటారని, మేం సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. అలాగే ఈ కేసు దర్యాప్తు కోసం ఎన్ఐఏ అధికారులు సైతం పరిశీలిస్తున్నారని పోలీస్ అధికారి తెలిపారు.