iDreamPost
android-app
ios-app

లోక్ సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. హీరోపై ఆయన తల్లి పోటీ..

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మరో మూడు దశల పోలింగ్ మిగిలి ఉంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మరో మూడు దశల పోలింగ్ మిగిలి ఉంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

లోక్ సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. హీరోపై ఆయన తల్లి పోటీ..

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు దశలకు గానూ.. ఇప్పటికే నాలుగు దశలకు ఎన్నికలు ముగిశాయి. ఇక మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మే 13న పోలింగ్ జరిగింది. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ పోలింగ్ ఏకకాలంలో నిర్వహించారు. ఇక ఈ ఎన్నికల వేళ.. వింతలు, విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. బంధుత్వంలో చిచ్చు పెడుతున్నాయి ఈ ఎన్నికలు. ఇంట్లోని రక్త సంబంధీకులే పోటీ పడుతున్న ఘటనలు చూశాం. కానీ ఈ సారి ఏకంగా కొడుకుపై తల్లి పోటీ చేయడం గురించి విన్నారా.. అదే జరిగింది ఇప్పుడు. భోజ్ పురి సూపర్ స్టార్ పై ఆయన తల్లి పోటీ చేయడం గమనార్హం.

భోజ్ పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ బీహార్ రాష్ట్రంలోని కరాకట్ నియోజక వర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజెపీ ఆయనకు సీటు కేటాయించగా.. వద్దని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుండి ఆయన తల్లి పోటీ పడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ సింగ్ తల్లి ప్రతిమా దేవీ కూడా అదే నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది.  తల్లి, కుమారులిద్దరూ ఒకే స్థానంలో.. అదీ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Mother compitation to hero

ఇదిలా ఉంటే.. కరాకట్ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాష్ట్రీయ లోక్‌మోర్చా తరఫున కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ పోటీ చేస్తున్నారు. ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి రాజారామ్ సింగ్‌ బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు ఇదే స్థానం నుండి తల్లీకొడుకులు పోటీ చేయడం పలు అనుమానాలకు తావునిస్తుంది. అయితే బీజెపీ నుండి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొడుకు పవన్ సింగ్ పోటీ చేయడంతో.. కమలం పార్టీ తన కొడుకుపై ఏవైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకుందేమోనని ప్రతిమా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లీకొడుకులు ఇద్దరు కూడబలుక్కొని బరిలోకి దిగుతున్నారన్న అన్న సందేహం మిగిలిన పార్టీ నేతల్లో కూడా నెలకొంది. లేక కొడుకుపై నిజంగానే పోటీ చేస్తుందా అనేది నామినేషన్ విత్ డ్రా రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.