రైలెక్కిన రాహుల్‌ గాంధీ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం!

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ రైలెక్కి సందడి చేశారు. ఛత్తీష్‌ఘర్‌లోని బిసల్‌పూర్‌ నుంచి రాయ్‌పూర్‌ వరకు రైలులో ప్రయాణించారు. సోమవారం ఆయన ఛత్తీష్‌ఘర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత రైలు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖపై పలు కామెంట్లు చేశారు. నెలల వ్యవధిలో రైల్వే శాఖ ఏకంగా 2600 రైళ్లను రద్దు చేసిందన్నారు. దాని కారణంగా ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతోందని అన్నారు.

ఇక, రాహుల్‌ గాంధీని రైల్లో చూడటంతో ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగటానికి జనం ఎగబడ్డారు. భద్రతా సిబ్బంది సహాయంతో ఆయన తన దగ్గరకు వచ్చిన వారితో సెల్ఫీలు దిగి పంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ జన నాయకుడు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు’’.. ‘‘ తర్వాతి ప్రధాన మంత్రి రాహుల్‌ గాంధీనే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, రాహుల్‌ గాంధీ రైల్లో ప్రయాణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments