iDreamPost
android-app
ios-app

మహేష్, నమ్రతలానే అనంత్, రాధికా కూడా.. కామన్ పాయింట్ ఏంటంటే?

  • Published Mar 04, 2024 | 3:47 PM Updated Updated Mar 04, 2024 | 3:47 PM

మహేష్ బాబు, నమ్రత జంటకు.. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ జంటకు సంబంధం లేదు. కానీ వీరి విషయంలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే?

మహేష్ బాబు, నమ్రత జంటకు.. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ జంటకు సంబంధం లేదు. కానీ వీరి విషయంలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే?

మహేష్, నమ్రతలానే అనంత్, రాధికా కూడా.. కామన్ పాయింట్ ఏంటంటే?

ప్రస్తుతం దేశంలో బిగ్ చర్చ ఏదైనా ఉందంటే అది ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలే. మూడు రోజుల పాటు దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా వెళ్లారు. సినీ రంగం నుంచి రామ్ చరణ్, రజినీకాంత్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీలు హాజరవ్వగా.. క్రీడా రంగం నుంచి ధోనీ, సచిన్ వంటి వారు హాజరయ్యారు. గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, మార్క్ జుకర్ బర్గ్ వంటి పారిశ్రామికవేత్తలు ఈ వేడుకకు హాజరై ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మూడు రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలే ఇంత ఘనంగా జరిగితే ఇక పెళ్లి ఇంకెంత ఘనంగా జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక ఈ ఏడాది జూలై 12న జరగనుంది. ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి వేడుక బాగా ట్రెండింగ్ లో ఉంది. 

అయితే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంటకు.. మహేష్, నమ్రత దంపతులకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది.. వయసు. మహేష్ కంటే నమ్రత శిరోద్కర్ మూడేళ్ళ పెద్ద. మహేష్ బాబు 1975 ఆగస్టు 9న జన్మిస్తే.. నమ్రత 1972 జనవరి 22న జన్మించారు. ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల విషయానికొస్తే.. అనంత్ అంబానీ వయసు 28 ఏళ్ళు. 1995లో ఏప్రిల్ 10న జన్మించారు. ఇక రాధికా మర్చంట్ వయసు 29. ఈమె 1994లో డిసెంబర్ 18న జన్మించారు. ఇద్దరికీ నాలుగు నెలలు డిఫరెన్స్. రాధికా మర్చంట్.. అనంత్ అంబానీ కంటే నాలుగు నెలలు పెద్ద. ఇక మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ ఒకే రంగానికి చెందిన వారు. అది సినీ రంగం అన్న సంగతి తెలిసిందే. వీరిలానే అనంత్, రాధికా జంట కూడా ఒకే (వ్యాపార) రంగానికి చెందిన వారు.

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం, ఇతర సేవా కార్యక్రమాల్లో భాగమవ్వడం వంటివి చేస్తుంటారు. ఇటు అనంత్ అంబానీకి జంతువులంటే ప్రేమ. వాటి కోసం వంతారా అనే ఒక కృత్రిమ అడవిని సృష్టించారు. 200 ఏనుగుల కోసం, అలానే 43 జాతులకు చెందిన 2 వేల జంతువుల కోసం ప్రత్యేకంగా 3 వేల ఎకరాల్లో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక రాధికా మర్చంట్ కి కూడా జంతు సంరక్షణ, ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, పౌర హక్కులు, మానవ హక్కులు, వంటి విషయాలపై ఆసక్తి ఎక్కువ. మహేష్ బాబు, నమ్రతా వంశీ సినిమా అప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లిద్దరూ బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ఇష్టపడడంతో పెళ్లి చేసుకుంటున్నారు. గత ఏడాది జనవరి నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది. తమ కంటే వయసులో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. సచిన్ కంటే ఆయన సతీమణి అంజలి ఆరేళ్ళ పెద్ద. అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యారాయ్ రెండేళ్ల పెద్ద. ప్రియాంక చోప్రా, బిపాసాబసు, కత్రినా కైఫ్, ప్రీతి జింటా ఇలా చాలా మంది హీరోయిన్లు తమ కంటే వయసులో చిన్నవారిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు వివాహం చేసుకోబోతున్నారు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş