iDreamPost
android-app
ios-app

మహిళా ఖాతాలోకి వెయ్యి కోట్లు!.. ఆనందపడే లోపే

అదృష్టం తలుపుతట్టే లోపు.. దరిద్రం ఊరంతా తిరిగొచ్చేసిందని సామెత. కానీ కొన్ని విషయాలు చూస్తుంటే నిజమే అనిపించకమానదు. ఇదిగో ఈ కాఫీ షాప్ యజమాని విషయంలోనూ ఇదే జరిగింది.

అదృష్టం తలుపుతట్టే లోపు.. దరిద్రం ఊరంతా తిరిగొచ్చేసిందని సామెత. కానీ కొన్ని విషయాలు చూస్తుంటే నిజమే అనిపించకమానదు. ఇదిగో ఈ కాఫీ షాప్ యజమాని విషయంలోనూ ఇదే జరిగింది.

మహిళా ఖాతాలోకి వెయ్యి కోట్లు!.. ఆనందపడే లోపే

అదృష్టం పలకరించేలోపు దురదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే ఇదేనేమో. చిన్న కాఫీ షాప్ నడుపుతున్న వ్యాపారి భార్య ఖాతాలోకి అనూహ్యంగా కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అంత డబ్బు చూసేసరికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు భార్యా భర్తలు. ఆ ఆనందం ఎంత సేపు మిగుల్చలేదు బ్యాంకు అధికారులు. డబ్బును వెంటనే వెనక్కు తీసుకోవడంతో పాటు.. భార్య ఖాతాను కూడా ఫ్రీజ్ చేశారు. దీంతో పడిన డబ్బులు సంగతి దేవుడెరుగు.. ఖాతాలో ఉన్న సొంత డబ్బును కూడా తీసుకోలేని పరిస్థితి. అంతేనా కస్టమర్లకు హెల్ప్ చేయాల్సిన బ్యాంకు అధికారులే.. ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆ ఖాతా అన్ బ్లాక్ చేసుకునేందుకు సహకరించాల్సి పోయి.. రోజు తిప్పించుకోవడంతో వ్యాపారం కూడా దెబ్బతింది. దీంతో లబోదిబోమంటున్నాడు కస్టమర్. వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని ఐఐఎంలో చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు ప్రభాకర్. కాగా, ఆయన భార్యకు గతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఓపెన్ చేయగా.. తాజాగా రూ. 999 కోట్లు జమ అయినట్లు గుర్తించాడు. అంత డబ్బు చూసి సంబరపడిపోయాడు భర్త. అయితే ఆ ఆనందం కొన్ని నిమిషాల్లోనే ఆవిరి అయిపోయింది. ఆమె ఖాతాలోకి కోట్ల రూపాయలు పొరపాటును ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు.. 48 గంటల్లో ఈ మొత్తం డబ్బును విత్‌డ్రా చేసి ఖాతాను సీజ్ చేశారు. అయితే ఆ డబ్బుల్లో తాము సేవింగ్స్ చేసిన డబ్బులు కూడా ఉండిపోవడంతో ఏడుపు ఒక్కటే తక్కువ. ఆ బ్యాంక్ ఖాతాను అన్ బ్లాక్ చేసేందుకు పలుమార్లు బ్యాంకుకు తిరగడంతో కాఫీ షాప్ కూడా దివాళా తీసింది. కాళ్లు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

సాయం చేయాల్సిన బ్యాంకు అధికారులు సైతం.. తిరిగి అతడినే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంత డబ్బు  మీకు ఎలా వచ్చిందంటూ అతడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రభాకర్. డబ్బుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ అడుగుతున్నారని వాపోతున్నాడు. ప్రస్తుతం తన భార్య ఖాతాను నిలిపివేయడంతో లావాదేవీలు చేయలేని పరిస్థితులో ఉన్నామని చెబుతున్నాడు షాప్ యజమాని. ఆ డబ్బులు ఎలా వచ్చాయో , అసలు అలా ఎందుకు జరిగిందో తెలియదని అంటున్నాడు. అందులోనే కస్టమర్స్ వేసిన డబ్బులు, ఇతర పర్సనల్ నగదు కూడా ఉన్నట్లు వెల్లడించాడు. బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ చేసి తనను కష్టాల్లోకి నెట్టేశారని, షాప్ దివాళా తీసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై బ్యాంకుకు మెయిల్‌ కూడా పంపినా ఎలాంటి సమాధానం రాలేదని బాధపడుతున్నాడు. ఏం చేయాలో తనకు పాలు పోవడం లేదని అంటున్నాడు. ఈ నేపథ్యంలో కొందరు ఆర్బీఐకి సమాచారం ఇవ్వొచ్చునని అంటున్నారు.