P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా గుండె పోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. చిన్న వయసు నుంచి వృద్దుల వరకు హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా గుండె పోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. చిన్న వయసు నుంచి వృద్దుల వరకు హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు.
P Krishna
ఈ మద్యకాలంలో దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. హఠాత్తుగా హార్ట్ ఎటాక్ రావడం.. ఉన్నచోటే కుప్పకూలిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికే హార్ట్ ఎటాక్ వస్తుందని అనేవారు.. కానీ ఈ మద్య చిన్న వయసు వాళ్లు, ఆరోగ్యవంతులు సైతం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. ఎక్కువగా వ్యాయామం చేయడం, డ్యాన్సులు, వాకింగ్ చేయడం, భారీ శబ్ధాలు వినడం, అధిక ఒత్తిడి, అనారోగ్య కారణాల వల్ల చనిపోతున్నారు. అంతేకాదు గతంలో కరోనా వచ్చిన వారికి కూడా గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి ఉన్నచోటే కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్న జవాన్ అతడి ప్రాణాలు రక్షించారు. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలోని సంగ్లోయ్ మెట్రో స్టేషన్ లో ఓ జవాన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరిచే శభాష్ అనిపించుకున్నాడు. అనీల్ కుమార్ (58) అనే వ్యక్తి మెంట్రో స్టేషన్ లో చెకింగ్ పాయింట్ దాటి వస్తున్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ అక్కడి చేరుకొని ఏం జరిగిందా అని చూస్తున్నారు. అంతలోనే డ్యూటీలో ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్ ఉత్తమ్ కుమార్ సమయస్ఫూర్తి ప్రదర్శించాడు.. అనీల్ కుమార్ కి సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాల నిలబెట్టగలిగాడు. సీపీఆర్ చేసిన తర్వాత అనీల్ కుమార్ స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సమీప ఆస్పత్రిలో చేర్పించారు అధికారు. ఈ ఘటన శనివారం మధ్యహ్నం జరిగినట్లు తెలుస్తుంది.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సీఐఎస్‌ఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ మొత్తానికి సంబంధించిన భద్రతను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్ (సీఐఎస్‌ఎఫ్) నిర్వహిస్తుంది. మెట్రోలో ప్రయాణికులకు అసౌర్యం కలిగేలా ఎవరైనా ప్రయత్నించినా, దొంగతనాలు, అసాంఘిక కార్యాకలాపాలు జరగకుండా గట్టి భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు గతంలో కూడా సిబ్బంది మెట్రోలో కుప్పకూలిపోయిన ప్రయాణికులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపారు. ప్రస్తుతం అనీల్ కుమార్ ని కాపాడిన ఉత్తమ్ కుమార్ ని సోషల్ మీడియాలో తెగ ప్రశంసిస్తున్నారు.