Krishna Kowshik
ఇండియా, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో చైనా మీడియా చేస్తున్న వ్యాఖ్యలు.. అగ్నిలో ఆజ్యం పోసే చందంగా మారుతున్నాయి. సాధారణంగా భారత్ అంటే గిట్టని చైనా.. ఇప్పుడు ఈ వివాదంలోకి చేతులు పెడుతోంది.
ఇండియా, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో చైనా మీడియా చేస్తున్న వ్యాఖ్యలు.. అగ్నిలో ఆజ్యం పోసే చందంగా మారుతున్నాయి. సాధారణంగా భారత్ అంటే గిట్టని చైనా.. ఇప్పుడు ఈ వివాదంలోకి చేతులు పెడుతోంది.
Krishna Kowshik
భారత్, మాల్దీవుల మధ్య జరుగుతున్న వివాదంలో రోజు రోజుకూ ముదురుతోంది. లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన దేశ ప్రధాని.. అక్కడ స్కూబా డైవింగ్ చేయడంతో పాటు అక్కడ ఇసుక తిన్నెలపై సేద తీరారు. ఆ ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇక్కడ పర్యటించాలంటూ భారతీయులను కోరడంతో మాల్దీవులు ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా ప్రధానిపై, దేశ పౌరులపై పైత్యాన్ని ప్రదర్శించడంతో..ఇండియన్స్ దెబ్బ రుచి చూపించారు. మోడీకి మద్దతు తెలుపుతూనే..మాల్దీవుల ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రులను తొలగించింది మాల్దీవ్స్ గవర్నమెంట్.
అయినప్పటికీ.. లక్షద్వీప్ పర్యటించాలంటూ సెలబ్రిటీలు ఇచ్చిన సిఫార్సు మేరకు అటువైపుగా పయనమౌతున్నారు ఇండియన్స్. ఇదిలా ఉంటే.. ఈ రచ్చకు మరింత ఆజ్యానికి కారణమయ్యాడు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జా. ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతడు..చైనాకు అనుకూలంగా మారారు. మామూలుగా ఈ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. అధికారిక విదేశీ పర్యటనలో భాగంగా ఇండియాకు వస్తుంటారు. కానీ మెయిజ్జా మాత్రం డ్రాగన్ దేశానికి వెళ్లాడు. వివాదం జరుగుతుండగానే.. ఆ దేశంలో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియా, మాల్దీవుల దౌత్య పరమైన వివాదంలో చైనా చేతులు పెడుతోంది. సాధారణంగా ఏదైనా అంశంపైనా భారత్‌తో ఢీ అంటే ఢీ అంటూ ఉంటుంది చైనా.
ఉగ్రవాద అంశం కానీ..లేదా సరిహద్దు విషయంలో కానీ ఇండియాపై విషం కక్కుతూ ఉంటుంది ఈ డ్రాగన్ దేశం. ఇప్పుడు మాల్దీవుల విషయంలో భారత్ పై అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ వివాదం విషయంలో భారత్ దే తప్పు అన్నట్లు చిత్రీకరించేందుకు అక్కడ మీడియా పని చేస్తుంది. గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్లో భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దక్షిణాసియాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓపెన్ మైండెడ్ అవసరమంటూ వ్యాఖ్యలు చేసింది. ఆధిపత్యం చెలాయించాలనే మనస్తత్వంతో భారత్ ఉందని, ఎప్పటి నుండో ఇలాగే వ్యవహరిస్తుందని, ఇదే మాల్దీవులతో సత్సంబంధాలు దెబ్బతినడానికి కారణమౌతుందంటూ వ్యాఖ్యానించింది.
మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని, సమాన భాగస్వామిగా చూస్తామని పేర్కొంది. చైనా, భారత్ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటి కారణంగా తాము ఎన్నడూ కూడా భారత్‌ను దూరం పెట్టాలని మాల్దీవులను కోరలేదని స్పష్టం చేసింది. ఈ వివాదంలో మీడియా కథనాలతో అగ్నికి ఆజ్యం పోస్తుంది చైనా. ఇప్పటికే నష్టపోతున్న మాల్దీవులు.. చైనాను చూసి జబ్బలు చరుచుకుంటే మాత్రం.. ఆర్థికంగా మరింత పతనావస్థకు చేరుకునే అవకాశం ఉంది. మరీ ఇరు దేశాల మధ్య వివాదంలోకి చైనా జోక్యం చేసుకోవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిజేయండి.