Venkateswarlu
Venkateswarlu
మరి కొన్ని నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార పార్టీలు ఎంతో వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇక, ప్రతిపక్ష పార్టీలు కూడా తమదైన వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు.. తెలంగాణలోని దాదాపు మూడు కోట్ల మంది ఓటర్లు ఆయా పార్టీల భవితవ్యాలను నిర్దేశించనున్నారు.
అయితే, ఓటింగ్ సమయం దగ్గర పడేకొద్దీ ఓటర్ల విషయంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓటర్ల లిస్టులో పేరు లేకపోవటం.. ఉన్నా వివరాలు, ఇతర విషయాల్లో తప్పులు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఓటర్ ఐడీ గురించిన వివరాలు తెలుసుకోవాలంటే చాలా ప్రయాస పడాల్సి వచ్చేది. కానీ, టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత క్షణాల్లో అన్ని వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. మీరు, మీ ఓటర్ ఐడీ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో ఇట్టే తెలుసుకోవచ్చు. అసలు ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా? లేదా? కనుక్కోవచ్చు..
ఆన్‌లైన్‌లో ఓటరు జాబితాలోని మీ పేరు, ఇతర వివరాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..