బిలియనీర్‌ గౌతమ్ అదానీపై కేసు నమోదు..ఎందుకో తెలుసా?

Gautam Adani: భారతీయ సంపన్నుల్లో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ఒకరు. దేశంలో ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. తాజాగా అదానీపై కేసు నమోదైనట్లు ఓ వార్త సంచలనం రేపుతుంది.

Gautam Adani: భారతీయ సంపన్నుల్లో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ఒకరు. దేశంలో ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. తాజాగా అదానీపై కేసు నమోదైనట్లు ఓ వార్త సంచలనం రేపుతుంది.

ప్రముఖ వ్యాపారవేత్త.. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారతీయ సంపన్నుల్లో ఆయన ఒకరు.ఆయన వ్యాపారాలు పోర్టుల నిర్మాణం, సిమెంట్ రంగం, విమాన రంగం, మీడియా, బొగ్గు పరిశ్రమలు, రిటైల్ రంగాల్లో విస్తరించబడ్డాయి. దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది. మల్టీబిలియన్ డాలర్ల లంచం, మోసాలకు పాల్పపడినట్లుగా అదానీ,ఆయన బంధువులు, సహచరులు ఈ స్కీమ్ లో నిందితులుగా ఉన్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థలు అయిన రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ నవంబర్ 21న నివేదించాయి.

గౌతమ్‌ అదానీ అతని మేనల్లుడు సాగర్ 20 ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు కుట్ర పన్నినట్లుగా ఫిర్యాదే చేయబడ్డాయి. సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 265 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2,236) లంచాలు ఇచ్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ప్రకారం అదానీ.. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలు ఇచ్చారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, మరో ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ లపై సెక్యూరటీ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ మోసాలకు పాల్పపడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ లో అక్రమ మార్గాల ద్వారా ఆయా కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని న్యూయార్క్ కోర్టులో ఆయనపై అభియోగాలు మోపారు. అదే సమయంలో సాగర్ అదానీ తన సెల్ ఫోన్ ను లంచాల వివరాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సిరిల్ క్యాబెన్స్, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా రూపేశ్ అగర్వాల్ లపై కేసులు నమోదయ్యాయి. తాజాగా గౌతమ్ అదానీపై కేసు నమోదు కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆయనకు అభినందనలు తెలిపిన తర్వాత అదానీ.. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులను ప్రకలించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. అయితే నిందితులు ఎవరూ కస్టడీలో లేరని బ్రూక్లీన్ లోని యూఎస్ అటార్నీ బ్రయోన్ పీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. అదానీకి అరెస్ట్ వారెంట్ జారీపై అదానీ గ్రూప్ సంస్థ నుంచి కూడా ఎలాంటి స్పందనరాలేదు. మరోవైపు వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు. కాకపోతే అదాని అరెస్ట్ వారెంట్ పై మీడియాలో కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments