Venkateswarlu
Venkateswarlu
‘‘ది ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్( ఇస్రో) జులై 14న చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుడ్ని చేరుకునే ఘట్టంలో చంద్రయాన్ 3 మరో అడుగు ముందుకు వేసింది. చంద్రయాన్ 3 చివరి కక్ష్యలోకి అడుగుపెట్టింది. చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైంది. ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక క్షక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్ 3 ప్రస్తుతం 153 కి.మీ *163 కి.మీ వృత్తాకార కక్ష్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం నాటికి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోనుంది. 23వ తేదీన ల్యాండర్ సేఫ్‌గా చంద్రుడిపై ల్యాండ్ కానుంది. కాగా, ఇస్రో 2019లో చంద్రయాన్ -2 ప్రయోగాన్ని జరిపింది. అయితే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రయాన్-2 విఫలమైంది. చంద్రయాన్-2 వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్రో చంద్రయాన్ 3ని రూపొందించింది. ముందు జరిగిన తప్పులు జరగక్కుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంది. ఈ ఉపగ్రహాన్ని చాలా పగడ్భందీగా తీర్చిదిద్దింది.
ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తల బృందం చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇక, ఈ చంద్రయాన్-3 ప్రయోగానికి, అందుకు వినియోగిస్తున్న బాహుబలి రాకెట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇస్రో సొంతంగా అభివృద్ధి చేసిన లాంఛ్ వెహికిల్స్ లో ఎల్వీఎం-3 కూడా ఉంది. ఇది ఎంతో పవర్ ఫుల్.. ఎంత బరువును కూడా ఇది సునాయాసంగా మోసుకెళ్ల గలదు. మరి, చంద్రయాన్ -3 చివరి కక్ష్యలోకి అడుగుపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.