iDreamPost
android-app
ios-app

EPFO: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పీఎఫ్ లిమిట్ పెంపుపై కేంద్రం చర్యలు

  • Published Aug 19, 2024 | 2:30 AM Updated Updated Aug 19, 2024 | 2:30 AM

PF Limit: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల వేతన పరిమితిని పెంచాలని గత కొన్నేళ్లుగా డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పీఎఫ్ పరిమితని 15 వేల నుంచి 21 వేలకు పెంచుతున్నటు సమాచారం.

PF Limit: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల వేతన పరిమితిని పెంచాలని గత కొన్నేళ్లుగా డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పీఎఫ్ పరిమితని 15 వేల నుంచి 21 వేలకు పెంచుతున్నటు సమాచారం.

EPFO: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పీఎఫ్ లిమిట్ పెంపుపై కేంద్రం చర్యలు

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈపీఎఫ్ఓ పరిధిలోని ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల డిమాండ్ ని నెరవేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పీఎఫ్ వేతన పరిమితి 15 వేల రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ లిమిట్ ని పెంచమని ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్న క్రమంలో కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.  ఈపీఎఫ్ వేతన పరిమితిని 15 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ డిమాండ్లను పరిశీలించాల్సిందిగా కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2024సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల ముందు వార్తలు వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే కార్మిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగుల డిమాండ్ మేరకు వేతన పరిమితిని పెంచితే ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై అదనపు భారం పడుతుంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని కేంద్రం 2014లో సవరించింది. అప్పుడు రూ. 6,500గా ఉన్న పీఎఫ్ పరిమితిని రూ. 15 వేలకు పెంచింది. పదేళ్లు గడుస్తున్నా అప్పటి నుంచి ఎలాంటి సవరణలు చేయలేదు. అయితే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వేతన పరిమితిని 21 వేలకు పెంచడంతో.. ఈపీఎఫ్ఓ పరిమితిని కూడా 21 వేలకు పెంచాలని డిమాండ్లు చేస్తున్నారు. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కింద 15 వేల బేసిక్ వేతనంపై కేంద్ర ప్రభుత్వం అందించే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ అనేది గరిష్టంగా 1250 రూపాయలు ఉంటుంది. అదే వేతన పరిమితి 21 వేలకు పెరిగితే ఈపీఎస్ కంట్రిబ్యూషన్ ని కేంద్రం రూ. 1749 వరకూ చెల్లించే అవకాశం ఉంది. దీని వల్ల ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మొత్తంలో పెన్షన్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.