iDreamPost

Aadhaar: కేంద్రం శుభవార్త.. వేలి ముద్రలు లేకుండానే ఆధార్ పొందవచ్చు

  • Published Dec 11, 2023 | 12:10 PMUpdated Dec 11, 2023 | 12:10 PM

నేటి కాలంలో ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అయ్యింది. అది లేకపోతే చాలా కష్టం. అయితే కొందరికి వేలి ముద్రలు లేని కారణంగా ఆధార్ కార్డు ఇవ్వడం లేదు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

నేటి కాలంలో ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అయ్యింది. అది లేకపోతే చాలా కష్టం. అయితే కొందరికి వేలి ముద్రలు లేని కారణంగా ఆధార్ కార్డు ఇవ్వడం లేదు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

  • Published Dec 11, 2023 | 12:10 PMUpdated Dec 11, 2023 | 12:10 PM
Aadhaar: కేంద్రం శుభవార్త.. వేలి ముద్రలు లేకుండానే ఆధార్ పొందవచ్చు

నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఆధారే మన గుర్తింపుగా మారింది. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలకైతే ఆధార్ కార్డు తప్పనిసరి. అది లేకపోతే.. గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందడం చాలా కష్టం. ఐడెంటి కార్డు అనగానే ఆధార్ చూపిస్తాం. అయితే ఆధార్ కార్డు పొందడానికి వేలిముద్రలు తప్పనిసరిగా కావాలి. మరి వేళ్లు సరిగా లేని వారు.. చేతులు లేని దివ్యాంగుల పరిస్థితి ఏంటి.. కొందరికి వేళ్లు అరిగిపోయి ఉండి ఫింగర్ ప్రింట్ పడదు. మరి అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి అంటే.. వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేలి ముద్రలు లేకుండానే ఆధార్ పొందవచ్చు అని స్పష్టం చేసింది. ఆ వివరాలు..

వేళ్లు లేని వారు.. వేలి ముద్రలు సరిగా పడని వారికి ఆధార్ కార్డు అంశంలో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇలాంటి వారంతా ఐరిస్‌ ద్వారా ఆధార్‌ పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. వేళ్లు లేవని, వేలి ముద్రలు సరిగా పడటం లేదన్న పేరుతో ఆధార్‌ను తిరస్కరించలేమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనకు చేతి వేళ్లు లేని కారణంగా ఆధార్‌లో పేరు నమోదు చేయించుకోలేక పోతున్నానంటూ కేరళకు చెందిన జోసిమల్‌ పీ జోస్‌ అనే మహిళ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్ర శేఖర్‌ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

aadhar with out thumb

అసలేం జరిగిందంటే..

కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోం పట్టణానికి చెందిన జోసిమల్‌ పీ జోస్‌ అనే మహిళ తనకు వేళ్లు లేని కారణంగా.. ఆధార్ ఇవ్వలేదని.. అందువల్ల తాను అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని.. తన సమస్యకు పరిష్కారం చూపమని కేంద్ర మంత్రిని కోరింది. దీనిపై ఆయన స్పందించడమే కాక ఆమె ఇంటికెళ్లి సిబ్బంది ఆధార్‌ నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అంతేకాకవేలి ముద్రలు ఇవ్వలేని వాళ్లు ఐరిస్‌ స్కాన్‌ ద్వారా, ఐరిస్‌ సరిగా రానివాళ్లు వేలిముద్రల ద్వారా ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎవరికైనా వేలి ముద్రలు, ఐరిస్‌ రెండూ లేకపోతే అవి లేకుండానే ఆధార్‌ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఐరీస్, వేలి ముద్రలు రెండు లేని వారు.. ఆధార్ పొందడం కోసం.. బయోమెట్రిక్‌ ఎక్సెప్షన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌ కింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలతో కూడిన బయోమెట్రిక్స్‌ ఇస్తే సరిపోతుందని తెలిపారు. వాళ్ల దగ్గర ఏయే అంశాలు లేవో ఆ వివరాలను ఎన్‌రోల్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడంతోపాటు.. మార్గదర్శకాలకు అనుగుణంగా ఫొటోగ్రాఫ్‌ తీసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించిన అనంతరం ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ సూపర్‌వైజర్‌ ధ్రువీకరిస్తే సరిపోతుందని.. ఆ తర్వాత వారికి ఆధార్ ఇవ్వాలని సూచించారు.

ఇక జోసిమల్‌ చేసిన విజ్ఞప్తితో అదే రోజే యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు. కొట్టాయం జిల్లాలోని కొమరకంలో ఆమె ఇంటికి వెళ్లి ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేయించారని రాజీవ్ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జోసిమల్‌లానే ఇంకా ఎవరికైనా చేతివేళ్లు లేకపోయినా.. ఉన్నా వేలి ముద్రలు సరిగా పడకపోయినా.. ఇతర ఏదైనా వైకల్యం కారణంగా వేలి ముద్రలు వేయలేకపోయినా.. వారంతా ప్రత్యామ్నాయ బయోమెట్రిక్‌ విధానాల ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలని అన్ని ఆధార్‌ సర్వీస్‌ కేంద్రాలకు సలహా జారీ చేసినట్టు చెప్పారు. కేంద్ర నిర్ణయం వల్ల చాలా మందికి మేలు జరుగుతుందని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి