పెన్షన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ సమస్యలకు ఒకేచోట పరిష్కారం.!

కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి.. అనేక సదుపాయాలను ప్రజలకు కల్పిస్తుంది. అలానే ఇప్పుడు పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.

కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి.. అనేక సదుపాయాలను ప్రజలకు కల్పిస్తుంది. అలానే ఇప్పుడు పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.

ప్రస్తుతం సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే అందుబాటులో ఉన్న టెక్నాలజీతో మనిషికి అనేక విధాలుగా మేలు జరుగుతోంది. సేవ, పారిశ్రామిక, బ్యాంకింగ్, వ్యవసాయ రంగం.. ఇలా అన్నీ రంగాల్లో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగి పోయింది. దీంతో అందరి సమయం, శ్రమ ఆదా అవుతున్నాయి. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాంకేతికతను ఉపయోగించి..ప్రజలకు అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి ఓ శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి.. అనేక సదుపాయాలను ప్రజలకు కల్పిస్తుంది. అలానే ఇప్పుడు పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్రం కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఎస్బీఐ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ను ప్రారంభించింది. దీంతో పెన్షనర్లకు సంబంధించిన అన్ని అవసరాలను,  సమస్యలు ఒక్క చోటే పరిష్కారం చేసే  సదుపాయం కల్పించారు.

ఐదు బ్యాంకుల పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపు సేవలను ఒకే విండోలో ఏకీకృతం చేయడం ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అనొచ్చు. ఈ పోర్టల్ పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ తీసుకోవడం, లేద ఇతర ప్రక్రియలను సులభతరం చేస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ప్రధాన అంశాలను గమనించినట్లు అయితే.. ఈ పోర్టల్ వల్ల అనేక సదుపాయాలు ఉన్నాయి.

ఇక దీని ద్వారా పదవీ విరమణ పొందినవారు తమ నెలవారీ పెన్షన్ స్లిప్పులను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. అలానే తమ పెన్షనలకు సంబంధించిన దృవీకరణ పత్రాలను స్థితి తెసుకునేందుకు, అలానే చెక్ చేయడానికి, ఫారమ్ 16 ను సమర్పించడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతోంది. అలానే చెల్లించిన బకాయిల స్టేట్ మెంట్ లను వీక్షించడానికి అవకాశం కల్పిస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్ బీ, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల నుంచి పెన్షన్ పోర్టల్ ను భవిష్య పోర్టల్ తో కనెక్ట్ చేశారు. దీని వల్ల పెన్షనర్లకు ఇప్పటికే ఉన్న సదుపాయలతో పాటు అదనపు సౌకర్యాలను పొందనున్నారు.

భవిష్య ప్లాట్ ఫారమ్ అనేది ఇంటిగ్రేటెడ్ పోర్టల్లో అంతర్భాగం. ఇది పెన్షన్ ప్రాసెసింగ్ ఇతర విధానాలను సులభతరం చేస్తుంది. ఎండ్ టూ ఎండ్ డిజిటలైజేషన్ ను కూడా సులభతరం చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెన్షన్ చెల్లింపు ఆర్డర్ జారీకి పెన్షన్ ఫారమ్లను ఆన్ లైన్ లో సమర్పించడాన్ని కోసం ప్లాట్ఫారమ్ రూపొందించబడింది. దీని వల్ల పెన్షన్ దారులకు సంబంధించిన పని పాదర్శకంగా జరుగుతోంది.

పదవీ విరమణ పొందిన వారికి వారి పెన్షన్ మంజూరు, దాని స్థితికి సంబంధించిన విషయాలు మేసేజ్ లేదా ఈ మెయిల్ రూపంలో అందుతాయి. ఈ పోర్టల్లో సీపీఈఎన్జీఆర్ఏఎంఎస్ ను కూడా కలిగి ఉంది. ఇది ప్రధానంగా ఫించన్ తీసుకునే వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి..కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త పోర్టల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments