iDreamPost
android-app
ios-app

వంట నూనె ధరలు తగ్గించాలంటూ కేంద్ర సూచన!

పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. కొండెక్కిన వస్తువుల ధరలను చూసి..కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో వంటనూనె విషయంలో కేంద్రం ఆయిల్ సంస్థలకు కొన్ని సూచలన చేసింది.

పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. కొండెక్కిన వస్తువుల ధరలను చూసి..కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో వంటనూనె విషయంలో కేంద్రం ఆయిల్ సంస్థలకు కొన్ని సూచలన చేసింది.

వంట నూనె ధరలు తగ్గించాలంటూ కేంద్ర సూచన!

నేటికాలంలో సామాన్యుడి జీవనం చాలా కష్టంగా మారింది. పెరుగుతున్న నిత్యవసర ధరలు మధ్యతరగతి మనిషిని నిద్రలేకుండా చేస్తున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి ఇంధనం వరకు అన్నీటి ధరలు ఆకాశం వైపే చూస్తున్నాయి.  కూరగాయలు, వంటనూనె ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. గ్యాస్ విషయానికి వస్తే.. గ్యాస్ బండ సామాన్యుడికి గుది బండగా మారింది. అలానే వంటనూనె వంటల్లో ఉయోగించక ముందే ధరతో సెల సెల కాగిపోతుంది. ఇలాంటి సమయంలో సామాన్యులకు ఊరట నిచ్చేందుకు కేంద్ర అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వంట నూనె ధరలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచన చేసింది.

ఏడాది క్రితం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ యుద్ధ ప్రభావం అనేక దేశాలపై పడింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రభుత్వం చూస్తోంది. అయితే తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఉత్పత్తులు ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనె బ్రాండ్ కంపెనీలకి సూచించింది. అయితే ఇందుకోసం సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ ల అసోసియేషన్ కి కేంద్రం  తెలిపింది. తక్షణం ధరలని తగ్గించడం సాధ్యం కాదని వంటనూనె సంస్థలు అంటున్నాయి.

ఆవాల పంట కొరత మొదల్యే మార్చి దాకా రిటైల్ ధరలను తగ్గించడం వీలు కాదని పరిశ్రమ వర్గాలు కేంద్రానికి చెప్పాయి. సోయాబీన్, పొద్దు తిరుగుడు, పామాయిల్ వంటి వంట నూనెల్ని ఎమ్మార్పీని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తగ్గించలేదని కేంద్ర వినియోదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటోంది. ఇప్పటికిప్పుడు వంట నూనె ధరలను తగ్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశ్రమకు చెందిన అధికారులు అంటున్నారు. ప్రతి నెల ఎంఆర్పీని సవరించడం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు వంట నూనె పరిశ్రమలు పరిగణలోకి తీసుకుంటే.. అది సామాన్యులకు భారీ ఉరటనే చెప్పొచ్చు. మరి.. వంటనూనె ధరల తగ్గించే విషయంలో కేంద్రం చేస్తున్న సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.