PM కిసాన్‌ పెంపు పై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది!

ఇటీవల బడ్జెట్ సమావేశలో పలు అంశాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెంపు విషయంలో స్పష్టమైన వైఖరి తెలిపింది.

ఇటీవల బడ్జెట్ సమావేశలో పలు అంశాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెంపు విషయంలో స్పష్టమైన వైఖరి తెలిపింది.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. ఇప్పటి వరకు పేద ప్రజలకు, రైతులకు చాలా పథకాలు తెచ్చింది. రైతుల కోసం తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్దిదారులకు ప్రతి 4 నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు అందజేస్తారు.. ఇవి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయబడతాయి. ఇటీవల పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏదైనా చర్చలు జరుగుతాయని భావించారు. తాజాగా ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య జరిగిన మధ్యంతర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పీఎం కిసాన్ పై అన్నదాతలకు గుడ్ న్యూస్ ఉండబోతుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల నుంచి రూ.9 వేల వరకు పెంచవొచ్చు అన్నది వార్త సారాంశం. సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే ఆ గుడ్ న్యూస్ రావొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అలాంటి ఊసే లేకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగిసిపోయింది. ఈ విషయంపై తాజాగా కేంద్రం స్పష్టత ఇచ్చింది. పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచన లేదని పార్లమెంట్ వేధికగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది.

లోక్ సభ సభ్యులు ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్ మొత్తాన్ని ఏడాదికి రూ. 12 వేల వరకు పెంచే ప్రస్తక్తి లేదని.. మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ. 2.81 లక్షల కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందులో ఎక్కువ శాతం ఉత్తర్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ నుంచి ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మార్కెట్ లో ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా పీఎం కిసాన్ నిధులను పెంచాలని కొంత కాలంగా రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.

Show comments