P Krishna
Kolkata Trainee Doctor Case: ఇటీవల కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యారాచం, హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
Kolkata Trainee Doctor Case: ఇటీవల కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యారాచం, హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
P Krishna
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ద మహిళలను సైతం కామాంధులు వదలడం లేదు. గత నెల కోల్‌కతా ఎంతో పేరు ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్ లో ఓ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగింది. అంత పెద్ద ఆస్పత్రిలో ఓ వైద్యురాలికి రక్షణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులు, వైద్యులు, సినీ, రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై రేప్, మర్డర్ కేసును సీరియస్ గా తీసుకుంది కోల్‌కతా హై కోర్టు. ఈ కేసును బెంగాల్ పోలీసులు సీబీఐకి అప్పజెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ ఈ కేసు విషయంలో దూకుడు పెంచింది. ఆర్జీ కార్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్ అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ ఘటన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీబీఐ ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.
ట్రైనీ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గతంలో వచ్చిన వార్తలను కొట్టిపడేసింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తమ విచారణలో గుర్తించినట్లు సీబీఐ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని సాక్ష్యాలను బట్టి నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆపై సంజయ్ రాయ్ అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడమే కాదు.. గాయపరిచాడని వెల్లడించాయి. ఈ కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు.